TIRUPATI TIURAPTI BY ELECTION CAMPAIGN TURNED INTO CORONA HOT SPOT AS CHITTOOR DISTRICT REPORTING HUGE POSITIVE CASES IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Corona Virus: తిరుపతి ఉపఎన్నిక కరోనా హాట్ స్పాట్ గా మారిందా..? కేసుల పెరుగుదలకు కారణం అదేనా..
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ (Corona Positive0 కేసుల్లో ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే (Chittoor District) నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వైరస్ ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా భూమిపైనే ఉండరేమో. చైనాలో తయారైన ఈ మహమ్మారి విగ్రరూపం దాల్చి మానవాళిని మనుగడను సవాల్ చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో కేసులు తగ్గుముఖం పట్టినా.. మాయదారి కరోనా సెకండ్ వేవ్ అంటూ ప్రజలను మరోమారు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి మొదటి రెండవ వారంలో చిత్తూరు జిల్లాలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పాజిటివ్ కేసులు.. ఇప్పుడు చూస్తుండగానే వేలకు చేరాయి. మార్చి రెండో వారం నుంచి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతు వచ్చింది. గత వారం రోజులుగా రోజుకు వెయ్యికి పైగా కరోనా నిర్ధారణ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. సోమవారం నాటికీ జిల్లా వ్యా ప్తంగా 1,01436మందికి కొవిడ్ సోకగా 91,809 మంది కోలుకున్నారు. కొవిడ్ మర ణాల సంఖ్యలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ప్రారంభంలో మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండగా.. ప్రస్తుతం యువకుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మదనపల్లెలో 21 ఏళ్లు, పుత్తూరులో 23 ఏళ్ల యువతులు చిత్తూరులో 35 ఏళ్ల యువకులు కొవిడ్ లక్షణాలతో కన్ను మూశారు.
కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తేనే..కోవిడ్ ను నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. జిల్లాలో తక్కువగా కొవిడ్ పరీక్షలు చేస్తున్పరిస్థితి నెలకొంది. వీటి ఫలితం తెలియడంలో కూడా 24 గంటల నుంచి 40 గంటల సమయం పడుతోంది. ప్రైమరీ కాంటాక్టులను త్వరితగతిన గుర్తించి వారికీ పరీక్షలు నిర్వహించడం ద్వారా కేసులు తగ్గుముఖం పెట్టె అవకాశం ఉంది. అయితే ఇందులో ఆరోగ్య శాఖ అలసత్వం ప్రదర్శిస్తు న్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో రోజుకు 5వేలు- 6వేల పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య 2,500 నుంచి 4వేల వరకు ఉంది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, రవాణా సదుపాయాలు మునుపటిలాగే ఉండటం....జాగ్రత్తలు తీసుకో కపోవడంతో వైరస్ విజృంభిస్తోంది.
ఉపఎన్నికే కారణమా..?
జిల్లాలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న కరోనా కేసుల్లో దాదాపు 60 శాతం తిరుపతి నగరంలోనే నమోదవుతున్నాయి. గ్రామీణ మండలంలో 8- 15 శాతం కేసులు వస్తున్నాయి. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 70 శాతం మంది బాధితులుంటున్నారు. ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉండటం.. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ వాయువేగంతో విస్తరిస్తోంది. ఇక తిరుపతి ఉపఎన్నిక కూడా కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఎన్నికల ప్రచారం, భారీ బహిరంగ సభల నిర్వహణ తిరుపతిలో కేసులు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. తిరుపతిలో కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో క్వారంటైన్ వెళ్లిన రెండు రోజుల అనంతర పాజిటివ్ వచ్చింది.
ఇక ఇతర పార్టీ నేతలకు కార్యకర్తలకు మీడియా ప్రతినిధులకు అధిక సంఖ్యలో కరోనా నిర్ధారణ అవుతూ వస్తోంది. దీనికితోడు నిత్యం తిరుమల దర్శనాలకు వస్తున్న వారితో రద్దీ నెలకొనడం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పలువురు నాయకులు కూడా వైరస్ బారినపడ్డారు. వీటన్నింటితో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుందా..? లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.