హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: కొవిడ్ టైమ్ లో ఇతడే నిజమైన హీరో.. శంకర్ కు సెల్యూట్ చేయాల్సిందే..!

Andhra Pradesh: కొవిడ్ టైమ్ లో ఇతడే నిజమైన హీరో.. శంకర్ కు సెల్యూట్ చేయాల్సిందే..!

జంతువులకు ఆహారం అందిస్తున్న శంకర్

జంతువులకు ఆహారం అందిస్తున్న శంకర్

కొవిడ్ టైమ్ లో పేదలు, కార్మికులు, వలస జీవులకు ఉపాధి కరువై తినడానికి తిండిలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో మూగజీవాలు కూడా ఆకలితో అలమటించాయి.

కరోనా మహమ్మారి పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు ప్రజలు. గతేడాది మర్చి నెలలోని చివరి వారం నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మానవాళి మనుగడ ప్రశ్నర్థకంగా మార్చింది. కరోనా కష్టకాలంలో పలువురు దాతలు... పేదలు, కార్మికులు, నిర్వాసితులకు పెద్ద ఎత్తున్న సహాయం అందించారు. అయితే ముగా జీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆహారం కోసం అల్లాడిపోయాయి ముగా జీవాలు. సరైన తిండి, తాగునీరు దొరక్క అలమటించిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో మూగజీవాలున్నాయి. అనంతపురంలోని బుక్కరాయసముద్రానికి సమీపంలో ఉన్న కొండమీద రాయుడి ఆలయం వద్ద ఎక్కువగా ముగా జీవాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ అధిక సంఖ్యలో కోతులు, కాకులు, వివిధ జాతుల పక్షులు, కుక్కలు అధికంగా ఉంటాయి. లాక్ డౌన్ సమయం నుంచి ఇక్కడ వీటికి ఆహారం దొరకక అలమటిస్తున్న వేళ,, మూగజీవాల ఆక్రందనలు తెలుసుకున్న జయశంకర్ ముగా జీవాల క్షుద్బాధ తీర్చడానికి ప్రారంభించాడు.

ప్రతి రోజు ఉదయాన్నే ఆలయం కొండ పైకి వెళ్లి వాటికి ఆహారం అందిస్తూ వస్తున్నారు. గత 350 రోజులుగా ఆలనాపాలనా వస్తున్నాడు. తనకు తోచిన విధంగా బిస్కెట్, పండ్లు, టమోటా, అన్నం, ఇతర కూరగాయలను ఆహారంగా అందిస్తున్నాడు. చీమ లకు సైతం చక్కెరను ఆహారంగా గుడి వద్ద పెడుతున్నాడు. అలాగే ఇంటి నుంచి తాగునీరు తీసుకెళ్లి తొట్టెల్లో పెట్టి అందుబాటులో పెట్టాడు. ముగజీవులేవైనా అనారోగ్యం, గాయాలపా లైనా వాటిని గుర్తించి చికిత్స అందిస్తున్నాడు.

రోజులాగే ఆహారం అందించడానికి జయశంకర్ కొండపైకి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఒకరోజు ప్రమాదం జరిగి కాలు విరిగింది. ఆసుపత్రిలో మంచంపై ఉన్నా మూగజీ వాల గురించే ఆలోచించాడు. శివకుమార్ అనే మరో జంతు ప్రేమికుడి సాయంతో నెలరోజులపాటు సేవ కొన సాగించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తిరిగి తన సేవలను కొనసాగిస్తున్నాడు.


దీనిపై శంకర్ మాట్లాడుతూ "రోజు 24 కిలో మీటర్ల ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సృష్టిలో ఆకలి అన్ని జీవులకూ ఒకే విధంగా ఉంటాయి. ఆహారం, నీరు లేక ఎన్నో జీవులు చని పోతున్నాయి. వాటన్నింటినీ మనుషులే కాపాడాలి. ముగా జీవులను కాపాడటం మన అందరి బాధ్యత...అందుకే నా వంతు సహాయాన్ని ముగా జీవాలకు చేస్తూ వస్తున్న. సంపాదనలో కొంత జీవుల మనుగడకు ఖర్చు చేద్దాం. అసలే వేసవి కాలం....పక్షులు., ఇతర జీవులు దాహార్తి తీర్చుకోవడం కోసం ఇంటి వద్దకు వస్తాయి. వాటిని తరిమి వేయడం., కొట్టడం కాకుండా వాటికీ పిడికెడు ఆహారం దోసెడు నీళ్లు అందించాలి. ఇంటి ముందు పక్షులకు ఇంటి కుండలు ఏర్పాటు చేయాలి” అని విజ్ఞప్తి చేస్తున్నాడు.

First published:

ఉత్తమ కథలు