Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUPATI POLICE ARRESTED TWO THEFTS AS THE ACCUSED IN 80 CASES IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati: ఇంటికి కన్నంవేస్తే పట్టుకున్నారు.. తీగలాగితే కదిలిన డొంక పెద్దదే.. ఈ తోడుదొంగలు మహాముదుర్లు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Tirupati: దోచుకోవడంలో దొంగలు ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటారు. కొందరు తమ మార్క్ కనపడాలని కొన్ని గుర్తులను చోరీ చేసిన ప్రదేశాల్లో విడిచిపెడుతారు. మరి కొందరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారు. ఓ దొంగల ముఠా మాత్రం ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 80 దోపిడీలు చేసింది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    దోచుకోవడంలో దొంగలు ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటారు. కొందరు తమ మార్క్ కనపడాలని కొన్ని గుర్తులను చోరీ చేసిన ప్రదేశాల్లో విడిచిపెడుతారు. మరి కొందరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారు. ఓ దొంగల ముఠా మాత్రం ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 80 దోపిడీలు చేసింది. సినీఫక్కీలో ఆ గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఓ దొంగల ముఠా హల్ చల్ చేస్తుంది. తిరుపతి అర్బన్ పరిధిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్,ఎంఆర్ పల్లి., తిరుచానూరు పరిధిలో దాదాపు 10 ఇళ్లకు పైగా చోరీలు జరిగాయి. దీంతో తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు తిరుపతి అర్బన్ పోలీసులు.

    ఈ క్రమంలో విశాఖపట్నం, గాజువాక బాబూజీ నగర్ కాలనీకి చెందిన కర్ర సతీష్ అలియా సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండేళ్లుగా తిరుపతి నగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇతనిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లో సుమారు 80 పైగా కేసులు నమోదై ఉన్నాయి. అలాగే విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేడి షీట్, హైదరాబాద్ బంజారాహిల్స్ లో పిడియాక్ట్ నమోదు అయింది. ఇక రెండో ముద్దాయి నరేందర్ నాయక్ అలియాస్ నారి(26) నల్గొండ జిల్లా చిన్న పేట మండలంలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై తెలంగాణ హైదరాబాద్ సిటీ, వనస్థలిపురం, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, చిలకలగూడ, నేరేడు మిట్ట, బంజారాహిల్స్, దేవరకొండ, తమిళనాడులో మొత్తం కలిపి సుమారు 38 కేసులు నమోదై అయి ఉన్నాయి.

    ఇది చదవండి: కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కక్షగట్టిన అత్త.. పరువు కోసం దారుణం..


    వీళ్లిద్దరూ తాళం వేసిఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ దోపిడీలు చేయడం ఆ డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. తిరుపతిలో ఓ ఇంటి వద్ద చోరీకి పాల్పడటానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసుల కంటపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 943 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి సామాన్లు ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను, ఆభరణాలను బ్యాంకు లాకర్లలో ఉంచి వెళ్లడం మంచిదని ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. బయట ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలిపితే ఆ ఇంటికి ఎల్ హెచ్ ఎం ఎస్ ను కూడా పూర్తి ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Theft, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు