Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUPATI OLD WOMAN COMPLETES 100 YEARS AS FAMILY CELEBRATES HER BIRTHDAY FULL DETAILS HERE PRN TPT

Tirupati: ఇలాంటి వాళ్లను చూడాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి.. కమలమ్మ లైఫ్ స్టైల్ తెలిస్తే షాక్ అవుతారు..!

కమలమ్మ

కమలమ్మ

Tirupati: సగటు మనుషుల జీవితకాలం 60 నుంచి 70 ఏళ్లు మాత్రమే. మహా అయితే మరో 10 సంవత్సరాల పాటు జీవిస్తున్నారు. ఈ రోజుల్లో వందేళ్లు జీవించి ఉండటం అంటే ఆషామాషీ కాదు. కానీ ఓ వృద్దురాలు రీసెంట్ గా సెంచరీ కొట్టారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  సగటు మనుషుల జీవితకాలం 60 నుంచి 70 ఏళ్లు మాత్రమే. మహా అయితే మరో 10 సంవత్సరాల పాటు జీవిస్తున్నారు. కానీ అలనాటి కాలం నుంచి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు., దృఢమైన శరీరంకలిగిన వ్యక్తులు చాల అరుదు. వందేళ్లు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారా అంటే.. కోటిలో పది మంది మాత్రమే ఉన్నారని చెప్పుకోవచ్చు. వందేళ్లు జీవించి ఉండటం అంటే ఆషామాషీ కాదు. కానీ ఓ వృద్దురాలు రీసెంట్ గా సెంచరీ కొట్టారు. వందేళ్ళు దాటినా తన పనులు తాను చేసుకుంటూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరికీ భారం కాకుండా వచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఇక వంటలు కూడా ఆమె చేసుకొనే వారు. ఆగస్టు 7వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో 100 ఏళ్ళు పూర్తి చేసుకొని 101 ఏడాదిలోకి అడుగుపెట్టిన వృద్ధురాలిపై ప్రత్యేక కథనం.

  వృద్దురాలి పేరు కమలమ్మ.. ఈమె తిరుపతి (Tirupati) లోని కొర్లకుంటలో.. మునిస్వామి..,సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. అప్పట్లో ఐదవ తరగతి వరకు చదువుకున్న కమలమ్మకు 14వ  ఏటనే పెద్దలు వివాహం చేసుకున్నారు. భర్త గోపన్న హెడ్ కానిస్టేబుల్ పని చేసారు.అప్పటి కాలంలోనే ఇద్దరు పిల్లలు ముద్దు అని భావించిన కమలమ్మ ఇద్దరికీ జన్మనిచ్చారు. కుమారుడు., కుమార్తె ఉన్నారు. కుమారుడు అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ చదివాడు. కండక్టర్ గా విధులు నిర్వహించి కొన్నాళ్ల క్రితంకాలం చెందారు. ఇక కుమార్తెను సైతం అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ చదివించారు. 1922ఆగస్టు 7వ తేదీ జనమించిన కమలమ్మ 2022ఆగస్టు7నాటికి వందేళ్ల పూర్తి చేసుకున్నారు..

  ఇది చదవండి: ఈ ఐదు రోజులు తిరుమల రావద్దు.. టీటీడీ కీలక ప్రకటన.. కారణం ఇదే..!


  ఇప్పటికీ కమలమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. తన పనులను తానే స్వయంగా చేసుకోగలుగుతున్నారు. తన కుటుంబం చాలా పెద్దది.. అయినా ఎవ్వరీ సహాయాన్ని ఆశించరు. ఇప్పటీ చలాకీగా ఉంటున్నారు. మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. వంటపనిని.., ఇంటిపనిని స్వయంగా చేసుకుంటూ.., ఔరా అనిపిస్తున్నారు. వందేళ్లు నిండినా.., చూపు తగ్గలేదు. వినికిడి లోపం లేదు. ఇదెలా సాద్యమంటే.., క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని అవలంబించడం వల్లే సాద్యమంటున్నారు కమలమ్మ కుటుంబ సభ్యులు.

  ఇది చదవండి: 800 ఏళ్లనాటి ఆలయం.. రాయల వైభవానికి ప్రతీక.. నేడు ఇలా..!


  సంసారమంటే సముద్రమనీ.., ఓర్పుతో ఈదకలిగితేనే.. ఒడ్డుకు చేరకలుగుతామని,దీనికి ఆమె జీవన విధానామే నిదర్శన తెలిసింది. జీవితమంటేనే పోరాటమనీ..,సహనం లేకపోతే లక్ష్యాలను చేరుకోలేమనీ.., ఆ వృద్దురాలు నడుచుకున్న తీరుతెన్నులు తెలియజేస్తున్నాయి. ప్రేమాభిమానాలతో కుటుంబంలో పట్టు సాదించేందుకు వీలవుతుందని చెప్పిన పండుటాకు కమలమ్మ.., ఆ వరవడినే చివరి వరకు కొనసాగించి.., కుటుంబ గౌరవాన్ని కాపాడాలనీ.., తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసినట్లు కమలమ్మ కుమార్తె, కుటుంబ సభ్యులు తెలియజేసారు. నిరాడంబరంగా ఉండే ఆ వృద్దురాలు.., తోటి వారికి కష్టం వస్తే చెలించి పోయేవారు. తనకు ఉన్నదాంట్లోనే..తోటి వారికి సహాయ పడేవారు. కాగా కమలమ్మకు వందేళ్ల నిండటంతో.. ఆమె కుటుంబ సభ్యులు వందేళ్ల పండుగను నిర్వహించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు