Andhra Pradesh: తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆస్తి ఇంతేనా? పోటీ చేసే ముందు 10 లక్షలు కూడా లేవా?

తిరుపతి ఎంపీగా నెగ్గిన గురుమూర్తి ఆస్తుల విలువ ఎంతో తెలుసా

తిరుపతి ఎంపీ గురుమూర్తి వ్యక్తిగత వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినప్పుడు తన దగ్గర 10 లక్షల రూపాయలు కూడా లేవు ఎలా పోటీ చేయాలని అని ఆయన జగన్ తో అన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ప్రస్తుతం గురుమూర్తి ఆస్తుల విలువ ఎంత? కనీసం సొంత కారు కూడా లేదా?

 • Share this:
  తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక సమయంలో.. సామాజిక సమీకరణాలు, స్థానిక బలం, ప్రజల్లో ఆదరణ ఇలా అన్ని లెక్కలు వేసుకుని చివరికి డాక్టర్ గరుమూర్తికి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఓటు వేశారు. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే గురుమూర్తి.. సీఎంను కలిసి తన దగ్గర 10 లక్షల రూపాయలు కూడా లేవని తనని ఎంపీగా నిలబెట్టారు..మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అని వాపోయినట్టు తెలుస్తోంది. అయినా జగన్ చిరునవ్వుతో గెలుపు మీదే బ్రదర్ అని విష్ చేసి పంపినట్టు అప్పట్లో ప్రచారం  జరిగింది. నిజంగానే గురుమూర్తి దగ్గర ఆస్తులు లేవ? అసలు ఆయన ఆస్తుల విలువ ఏంటి? వ్యక్తిగతంతంగా ఆయనకు ఉన్న ఇమేజ్ ఏంటి అన్నది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది.

  తిరుపతి ఎంపీగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘన విజయం సాధించారు. నాలుగు లక్షలు పైగా మెజార్టీ పక్కా వస్తుంది అనుకుంటే ... మూడు లక్షలకు దగ్గరగా ఆయన బలం ఆగిపోయింది. అయినా తిరుపతిలో ఆయనది రికార్డు విజయమే. ఓవరాల్ ఓటింగ్ శాతం తగ్గడంతోనే తమ మెజార్టీ తగ్గిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మెజార్టీ సంగతి ఎలా ఉన్నా ఎంపీగా గురుమూర్తి విజయం వైసీపీపై శ్రేణులకు ఆనందాన్ని ఇచ్చేదే.. దీంతో ఇప్పుడంతా ఎంపీగా నెగ్గిన గురుమూర్తి ఆస్తుల విలువ ఎంత? లాంటి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంపై  అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

  ప్రస్తుతం అతడి ఆస్తుల వివరాలు కూడా అందరికీ షాక్ ఇచ్చేలానే ఉన్నాయి.ఆయన పేరు మీద కనీసం కారు కూడా లేదంట. గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం 47.25 లక్షల రూపాయలుగా ఆయన ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే ఇందులో గురుమూర్తి వ్యక్తిగత ఆస్తి కేవలం10 లక్షల 66 వేల 515 రూపాయాల విలువైన చరాస్తులు ఉన్నాయి. భార్య నవ్యకిరణ్ పేరుమీద 24 లక్షల 92 వేల 529 విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. తన భార్య పేరుతో 7 లక్షల విలువైన కారు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. అలాగే ఏర్పేడు మండలం మన్నసముద్రంలో సొంతగా గురు మూర్తి పేరుమీద 2 ఎకరాలు వ్యవసాయ భూమి పేరుతో చరాస్థి ఉందన్నారు. 2610 చదరపు అడుగుల్లో సొంత ఇళ్లు ఉందని దాని ప్రస్తుతం విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అలాగే గురుమూర్తిపై ఆదారపడి ఉన్న కార్తికేయ నిక్షాల్ దగ్గర 2.92 లక్షల రూపాయల విలువైన 62 గ్రామలు బంగారం, డెలీనా నిక్షాల్ దగ్గర 3.73 లక్షల రూపాయల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.     గురుమూర్తి అఫిడవిట్

  తిరుపతి ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే ఉద్దండుల మధ్య పోటీ చేసి ఆయన విజయం సాధించారు.  గురుమూర్తిని అభర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఎన్నికల్లో విజయం సాధించేవరకు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గెలుపే విజయం సాధించేలా ప్రోత్సహించారు.

  చిత్తూరు జిల్లా శ్రీకాహళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్నసముద్రం గ్రామానికి చెందిన మద్దిల మునికృష్ణయ్య కుమారుడు గురుమూర్తి. 1985 జూలై 22న జన్మించారు. వ్యవసాయకుటుంబానికి చెందిన ఆయన.. స్విమ్స్ లో ఫిజియోథెరపీని అభ్యసించారు. ఆయనకు భార్య నవ్య కిరణ్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు.

  సౌమ్యుడిగా పేరుపొందిన గురుమార్తి... పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆ సమయంలో ఆమె వెంటే నిలిచారు.  ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు. ఇవన్నీఆయన్ను ఇప్పుడు ఎంపీగా చేశాయి.
  Published by:Nagesh Paina
  First published: