Andhra Pradesh: కరోనా వేళ వీళ్లే ఆత్మబంధువులు… వారి సేవలకు సలాం కొట్టాల్సిందే..!

తిరుపతి కొవిడ్-19 జేఏసీ సభ్యులు

కరోనా కష్టకాలంలో నా అనుకున్నవాళ్లే దూరమవుతున్నారు. వైరస్ భయంతో సొంతవాళ్ల అంత్యక్రియలు చేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులను నిత్యం మనం చూస్తున్నాం. కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు బంధువులు సైతం దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రజలు భయంగుపెట్లో పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన వారిని చివరి చూపు చూసేందుకు కూడా ఆత్మీయులు దగ్గరకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయట వ్యక్తులతో అంత్యక్రియలు చేయించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కరోనా మృతదేహం కావడంతో కిలోమీటర్ల లెక్కన 20కిలోమీటర్ల దూరానికి కూడా 10వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక అంత్యక్రియలకు అయితే ముందుకు వచ్చే వారే కరువు.., ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు రాకపోతేనేం మేము ఉన్నాం అంటోంది ముస్లిం కోవిడ్-19 జేఏసీ. కోవిడ్ తో చనిపోయిన వారు అనాధలు కాదు మా బంధువులు అంటున్నారు.

  కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా తీవ్రప్రభావం చూపింది. మరణాల సంఖ్య పెరుగుతూ వాటిని ఖననం చేసేందుకు బంధువులు సైతం ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తిరుపతిలో కొందరు ముస్లిం యువకులు, ముస్లిం పెద్దల సహకారంతో కోవిడ్-19 జేఏసీని ప్రారంభించారు. ముస్లిం పెద్దలు, ఇతర దాతల సహకారంతో రెండు నూతన అంబులెన్సులను కొనుగోలు చేశారు. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం మొదలెట్టారు. గత ఏడాది ఆగష్టులో ప్రారంభం అయిన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. తమ అంబులెన్సులలో చనిపోయిన వ్యక్తులకు అంతిమయాత్ర నిర్వహించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ లేక ఇతర మతస్తులైతే వారి మతం ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీటన్నికి డబ్బులు అధిక మొత్తంలో తీసుకుంటారు అనుకుంటే మీరు కచ్చితంగా పొరపడినట్లే. వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మొత్తం ఖర్చులన్నీ కోవిడ్-19 జేఏసీనే భరిస్తుంది.

  ఇది చదవండి: కుండలో బంగారం పెడితే రెట్టింపు అవుతుందంటూ పూజలు... 21 రోజుల తర్వాత తెరిచి చూస్తే...


  తాజాగా కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా...మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇక తిరుపతి కాకుండా బయట ప్రాంతాల్లో అంత్యక్రియలు చేయాలంటే. వారి వద్ద నుంచి కేవలం డీజిల్ ఖర్చును మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది రోజుకు 2 నుంచి 3 మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన కోవిడ్-19 జేఏసీ గౌస్ టీం, ప్రస్తుతం సెకండ్ వేవ్ లో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. జేఏసీ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మొత్తం 460 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రోడ్డుపై అనాధగా పడిఉన్న మృతదేహాలను పోలీసుల అనుమతితో వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేస్తారు. మతం తెలియకపోతే...హిందూ ఆచారం ప్రకారం అంతిమ సంస్కారాలు చేస్తారు. నెలకు కోవిడ్-19 జేఏసీ వ్యయం ఒక లక్ష నుంచి 2 లక్షల పైమాటే.

  ఇది చదవండి: కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు... ఆక్సిజన్ కొరతకు ఇదే నిదర్శనం..


  ఇదంతా ఒకరి వల్ల సాధ్యమా అంటే కాదు. కోవిడ్-19 జేఏసీ కొరకు నిరంతరం 70 మంది పనిచేస్తుంటారు. 20 మంది హాస్పిటల్ లో నమోదైన మరణాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న వారిని కనుగొంటారు. హాస్పిటల్ వర్గాల నుంచి వారి వివరాలు సేకరిస్తారు. వారి సంప్రదాయాలను అడిగి తెలుసుకుని మరొక టీంకు సమాచారాన్ని చేరవేస్తారు.

  ఇక రెండవ టీం అంత్యక్రియలకు కావాల్సిన అనుమతులు ఇతర సామాగ్రి సమకూర్చి మృతదేహాల కళనం చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. 3వ గ్రూప్ సభ్యులు స్మశాన వాటికలో కావాల్సిన సామాగ్రి, ఏర్పాట్లను పూర్తి చేస్తారు. చివరి టీం పీపీఈ కిట్లను ధరించి మృతదేహాలకు సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇలా ఫ్రంట్ లైన్ లో కొందరు, బ్యాక్ ఎండ్ లో మరికొందరు కోవిడ్-19 జేఏసీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏడాది కాలంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఈ టీం సభ్యుల్లో ఎవరికీ కరోనా సోకకపోవడం విశేషం. కరోనా కష్టకాలంలో వీరు చేస్తున్న సేవలను చూసి ఎవరైనా హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు.
  Published by:Purna Chandra
  First published: