Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUPATI CITY FILLED WITH GARBAGE AS SANITARY WORKERS CALL FOR STRIKE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati News: చెత్తకుప్పగా మారిన తిరుపతి నగరం.. శ్రీవారి చెంత ఎందుకీ పరిస్థితి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి.

    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. పారిశుద్ద్య కార్మికుల నిరవధిక సమ్మెతో తిరుపతి జిల్లా (Tirupati District) వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తిరునగరిలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలవడం దినికి తోడు పశువులు, కుక్కలు, ఆ చెత్తను చిందర వందరం చేయడంతో పాదచారులతో పాటు వాహనదారులు రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో నగర వీధులు మరింత అధ్వాన్నంగా తయారు అయ్యింది.. ప్రస్తుతం తిరుపతిలో 4 లక్షలకు పైగా జనాభా ఉంది. తిరుమల గోవిందుడి దర్శనంతో పాటు మెరుగైన వైద్యం కోసం తిరుపతి అసుపత్రులకు అలాగే ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలకు వచ్చే వారి సంఖ్య అధికం అయ్యింది.

    దీంతో రోజుకు 200 వందల మెట్రిక్ టన్నుల చెత్త తీరునగరిలో పొగ అవుతుంది.. నగరంలో 22,354 యుడిఎస్ కనెక్షన్లు, 456 కిలోమీటర్ల మేరకు చిన్న కాలువలు, 70 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీలు,మరో 189 కిలోమీటర్ల వరకు భూగర్భ డ్రైనేజీ లైన్లు, ఇంకా 77 కిలోమీటర్ల మేరకు సెకండరీ డ్రైనేజీ లైన్లు ఉన్నాయి. ఇక డ్రైనేజీ లైన్లు కాలం చెల్లడంతో చిన్న వానకే రోడ్లపై మురికి నీరు పొంగి పొర్లుతుంది.

    ఇది చదవండి: ఏపీలో వర్షాలు తగ్గుతాయా.? పెరుగుతాయా..? తాజా అప్ డేట్ ఇదే..!


    మరోవైపు తిరుపతి ‌నగరంలో దాదాపు ఆరు వందల‌ మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకు పోయింది. ఎక్కడి చెత్త అక్కడే నిలిచి‌ పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. గత మూడు రోజులుగా నిలిచి పోయిన చెత్తతో‌ దుర్వాసన రావడంతో నివాసితులు ఇండ్లల్లో‌ ఉండలేక పోతున్నాంమని ప్రజలు ఆవేదన‌ వ్యక్తం చేస్తున్నారు..‌ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.



    నగరిలోనూ ఇదే పరిస్థితి..!
    నగిరి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు గత ఎనిమిది రోజులుగా తమ వేతనాలు పెంచాలని కోరుతూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో బుధవారం నగరి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని కోరుతున్న మాస్టర్ వీవర్ పట్టించుకోవడం లేదన్నారు. వివిధ రాజకీయ పార్టీలు సైతం తమ నిరసనకు సంఘీభావం తెలియజేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అలాగే అధికారుల సైతం తమ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాలు ఆపేది లేదని వారు తెలియజేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు