Corona Alert: ఏపీలో మరో కంటైన్మెంట్ జోన్.. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అదే అంటున్న జనం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో కంటైన్మెంట్ జోన్ లు అంతకంతకూ పెరుగుతున్నాయి. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినా జిల్లాల వారిగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా బోర్డులు పెడుతున్నారు. తాజాగా తిరుపతిని అధికారికంగా కంటైన్మెంట్ జోన్ గా ప్రటించారు కమిషనర్.

  • Share this:
    ఏపీని కరోనా భయపెడుతోంది. రోజు రోజుకూ ఊహించని స్థాయిలో వైరస్ విస్తరిస్తోంది. గతంతో పోల్చుకుంటే పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. నిన్న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కేసుల సంఖ్య 12 వేలు దాటింది. కరోనా కారణంగా ఒక్కరోజులో మరణించిన వారి సంఖ్య 69కి పెరిగింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా  కట్టడి చేయడానికి లాక్ డౌన్ సరైన మార్గమే అయినా దాన్ని ఆఖరి ఆస్త్రంగానే వాడాలి అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో  చాలా చోట్ల ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్ కు ముందుకు వస్తున్నారు. భారీగా కేసులు నమోదవుతున్న చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు  జిల్లాల్లో వ్యాపార సంఘాలే సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించాయి. వారంతాల్లో పూర్తి లాక్ డౌన్ చేస్తూ.. మిగిలిన రోజుల్లో కొన్ని గంటల వరకు మాత్రమే షాపులు తీసి ఉంచుతున్నారు. అయినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అది కూడా పెద్దగా ఫలితం ఇస్తున్నట్టు ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఎందుకంటే రోజు రోజుకూ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది.

    అధికారికంగా ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఎప్పటికప్పుడు ప్రకటించడం లేదు. కానీ చిత్తూరు జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఏ మండలాన్ని కరోనా వదల్లేదు. దీంతో భారీగా కేసులు నమోదవుతున్న డివిజన్లు, పట్టాణాల పరిధిలో కంటైన్మెంట్ జోన్లు అని బ్యానెర్లు పెట్టి ఊరుకుంటున్నారు. కానీ అక్కడ కరోనా వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు.

    ఇక నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో కోరా ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో అక్కడక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు తప్పా. అధికారికంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం లేదు. తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు..

    తిరుపతి ఊహించని స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని.. ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులు నమోవదవుతున్నాయని.. అందుకే తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తున్నట్టు కమిషనర్ గిరీష ప్రకటించారు. ఇకపై అన్ని డివిజన్ లోనూ కఠినమైన ఆంక్షలు అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే తిరుపతిలో ఈ స్థాయిలో కేసులు పెరగడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఇటు స్థానికులు, అటు విపక్షాలు విమర్శిస్తున్నాయి.

    ముఖ్యంగా ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా భారీగా ర్యాలీలు, రోడ్డు షోలు నిర్వహించడంతోనే ఈ స్థాయిలో కరోనా విస్తరించింది అంటున్నారు   స్థానికులు. మరోవైపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేయికి పైగా కేసులు నమోదైతే.. ఒక్క తిరుపతిలోనే 50 శాతానికిపైగా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అయితే తిరుపతిలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయని తెలిసినా.. ఇతర ప్రదేశాల నుంచి భక్తులను అనుమతిస్తుండడం కరోనా పెరగడానికి కారణమంటున్నారు స్థానికులు. ముఖ్యంగా తమిళనాడులో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినా అక్కడ ినుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఏదో తూతూ మంత్రంగా దర్శనాలను కుదిస్తే సరిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  దీంతో మరోసారి తిరుమలలో పూర్తిగా దర్శనాలు నిలిపివేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
    Published by:Nagesh Paina
    First published: