Tirupati By Poll Result: టీడీపీ, బీజేపీ అవుట్? తిరుపతిలో లక్ష దాటిన వైసీపీ ఆధిక్యం

భారీ విజయం దిశగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

తిరుపతి ఉప ఎన్నిక లెక్కలు తేలిపోయాయి. వైసీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం లక్ష దాటింది. దీంతో టీడీపీ, బీజేపీల పని అయిపోయిందనే విమర్శలు మొదలయ్యాయి. ఇక ఏపీలో రెండో స్థానం తమదే అనుకుంటున్న బీజేపీ గేట్లు మూసుకున్నట్టే అనే వాదన వినిపిస్తోంది.

 • Share this:
  ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన తిరుపతి ఉప ఎన్నికలో విజయం ఎవరిదో తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే వంద శాతం నిజమయ్యాయి. గట్టి పోటీ ఇస్తాయి అనుకున్న టీడీపీ, బీజేపీలు అసలు రేసులో ఎక్కడా ముందుకు రాలేదు. కనీసం ఒక్క నియోజకవర్గంలోనూ ఆధిక్యం చూపించలేకపోయాయి.  ఇప్పటికే వైసీపీ అభ్యర్ధి గుర్తుమూరి ఆధిక్యం లక్ష మార్కు దాటింది. చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగింతే మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒక్క సెగ్మెంట్ లోనూ టీడీపీ, బీజేపీలకు అనుకూల ఫలితాలు రావడం లేదు.  తిరుపతిలో ముందు నుంచి విపక్షాలు పెద్దగా ఆశలు లేవు అక్కడ భారీగా దొంగ  ఓట్లు పడ్డాయని.. తిరుపతి అసెంబ్లీ వరకు ఉప ఎన్నకను రద్దు చేయాలని కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే తిరుపతిలో అందరూ ఊహించినట్టే వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.

  అయితే విపక్షాలు ఆశలు పెట్టుకున్న సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు ఎక్కడా కూడా ఇటు టీడీపీకి కాని, అటు బీజేపీ కాని ఆధిక్యం కనబర్చలేకపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలోనే ఉన్నారు.  ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఫలితం ఏపీలో ఉన్న విపక్షాలకు తీవ్ర నిరాశ మిగిల్చినట్టే..

  ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే వరుస ఓటముల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పరాజయం.. తిరుపతి వరకు కొనసాగింది. ఇటీవల చూసుకుంటే మొదట పంచాయతీ, తరువాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక.. ఇలా ఎన్నిక ఏదైనా టీడీపీకి ఓటమి తప్పడం లేదు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి సీనియారిటీ, విపక్ష నేత సొంత జిల్లాలో నియోజకవర్గం, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అన్నీ తమకు కలిసి వస్తాయని అంచనా వేసింది.  తిరుపతి ఉప ఎన్నిక గెలుపుతో తమ ఉనికి చాటుకోవాలని ఆశించింది. కానీ ఫలితం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఓటమి సంగతి పక్కన పెడితే ఆశించినంత స్థాయిలో పోటీ ఇవ్వలే్కపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో ఆ పార్టీ డోర్లు క్లోజ్ అయినట్టే చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ఆశించిన ఆ పార్టీ తమ దగ్గర ఉన్న అస్త్రాలు అన్నీ వాడేసింది. జాతీయ స్థాయి నేతలంతా బీజేపీ తరుపున ప్రచారానికి వచ్చారు. కుల, మత సమీకరణాలన్నీ బేరేజు వేసుకుని అభ్యర్థిని ఎంపిక చేశారు. తమకు బలం లేకున్నా.. జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అంచనా వేసింది. అందుకే స్వయంగా జనసేన అధినేత పవన్ ప్రచారానికి కూడా  వచ్చారు. ఇలా రెండు పార్టీలు కలిపి అభ్యర్థిని నిలిపినా..  మూడో స్థానానికికే బీజేపీ పరిమితం అయ్యింది. అలా అని గౌరవ ప్రమథమైన  ఓట్లు కూడా రాలేదు. తాజాగా అందిన సమాచారం చూసుకుంటే కనీసం ఆరు శాతం ఓట్లు కూడా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దక్కించుకోలేకపోయింది. ఈ ఉఫ ఎన్నిక ఫలితంతో ఏపీలో బీజేపీకి ఆదరన లేదన్నది తేలిపోయింది. ముఖ్యంగా ఆద్యాత్మికంగా ప్రాధాన్యం ఉన్న చోటే బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది. హిందూ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఆశించినా.. ఆ దిశగానే ప్రచారం సాగించినా ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.
  Published by:Nagesh Paina
  First published: