TIRUPATI TIRUPATI BY POLL RESULT UPDATE YCP CANDIDATE GET CLEAR MAJORITY BIG SHOCK TO PANABAKA LAMXI AND RATNA PRABHA NGS TPT
Tirupati By Poll Result: కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగిన పనబాక. రత్న ప్రభకు ఓటర్లు షాక్
పనబాక, రత్న ప్రభలకు ఓటర్లు సాక్
తిరుపతి ఉఫ ఎన్నిక ఫలితం టీడీపీ, బీజేపీలకు ఊహించని షాక్ ఇస్తోంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీదే రెండో స్థానం అన్నదానిపై స్పష్టత ఇచ్చింది. కనీసం సెకెండ్ ప్లేస్ తో వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవాలి అనుకున్న బీజేపీకి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కొనసాగుతోంది. అయితే అంతా ఊహించిందే జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు అధికారా వైసీపీ 60 శాతానికి పైగా ఓట్లతో ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదో రౌండ్ ఫలితం ముగిసే సరికి ప్రత్యర్థి పార్టీలకు అందనంత స్పీడ్ తో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అతడి ఆదిక్యం దాదాపు 30 వేలు దాటింది. ఈ పోలింగ్ ట్రెండ్ చూస్తుంటే సుమారు 5 లక్షలపైగా మెజార్టీ వైసీపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇఫ్పటి వరకు అందిన సమాచారం చూస్తే వైసీపీకి 62 వేల 029 ఓట్లు వస్తే.. టీడీపీకి32 వేల 669 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోతోంది. ఐదు రౌండ్లు ముగిసే సరికి కనీసం 5 వేల మార్కును కూడా బీజేపీ అందుకోలేకోపోయింది.
ఫలితంపై ఇప్పటికే అంచనా రావడంతో టీడీపీ పూర్తిగా ఢీలా పడింది. ఓటమి ఖాయమైనట్టే అని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఎంతో ఆశగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి.. చాలా ఉత్సాహంగా కనిపించిన ఆమె.. ఐదో రౌండ్ ఫలితలు చూశాక.. ఇక గెలవడం కష్టమే అని అభిప్రాయానికి వచ్చినట్టు ఉన్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె వెంటనే వెనుతిరిగారు.
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలి.. లేదా కనీసం ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పేలా రెండో స్థానంలో నిలవాలని ఆశించింది. వైసీపీ, టీడీపీకి పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. పనవ్ ప్రచారం,.. జనసేన అభిమానులు ఓట్లు తమను గట్టెక్కిస్తాయని ఆశించింది. కానీ ప్రస్తుతం ఫలితం చూస్తుంటే బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. రెండో స్థానంలో సంగతి పక్కన పెడితే డిపాజిట్ రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయి ఓట్లు రావడం లేదు. ఐదు రౌండ్లలో కలిపి కనీసం ఐదు వేల ఓట్లు కూడా బీజేపీ రాలేదు అంటే ఓటర్లు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చారు అన్నది అర్థం చేసుకోవచ్చు..
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అన్నది అందరూ ఊహించిందే. మెజార్టీ ఎంత అన్నదానిపైనే అంతా లెక్కలు వేసుకున్నారు. దీంతో రెండో స్థానం ెఎవరిది అన్నదానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్ చూస్తే వైసీీపీకి టీడీపీ ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వకపోయినా రెండో స్థానాన్ని మాత్రం పనబాక లక్ష్మి నిలబెట్టుకుంది. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయినా.. ఊహించిన ఓట్లు రావడం లేదు. జనసేన పొత్తు ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదని అర్థమవుతోంది. దీంతో ఈ రెండు పార్టీ పొత్తుపై అనుమానాలు పెరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.