Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUPATI BY POLL RESULT UPDATE 1ST ROUND BIG SHOCK TO TDP BJP NGS

Tirupati By Poll Result: తిరుపతి ఉప ఎన్నిక ఫలితం. తొలి రౌండ్ లో ప్రధాన అభ్యర్థులకు షాక్

తిరుపతి ఉప ఎన్నిక తొలి రౌండ్ ఫలితం

తిరుపతి ఉప ఎన్నిక తొలి రౌండ్ ఫలితం

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ప్రధాన అభ్యర్థులకు షాక్ ఇస్తోందా అనిపిస్తోంది. కౌంటింగ్ నెమ్మదిగా సాగుతుండడంతో ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ఆధిక్యం కనిపించినా.. తిరుపతి తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్థికి 2500 ఆదిక్యం ఉంటే, సత్యవేడులో పనాబాక లక్ష్మి ఆధిక్యంలోకి ఉన్నారు.

ఇంకా చదవండి ...
    రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా..  టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితం తమకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. అయితే తిరుపతిలో ఫలితం చాలా ఆలస్యంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలోనూ, అటు నెల్లూరులోనూ కౌంటింగ్ జరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ నిబంధనల ప్రకారం తక్కుమంది స్టాప్ తో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం ఆలస్యమవుతుంది అంటున్నారు.  అయితే ఇప్పటి వరకు అందుతున్న సమచారం చూస్తే తొలి రౌండ్ లో ఏ పార్టీకి పెద్ద మెజార్టీ వచ్చినట్టు కనిపించడం లేదు. పొస్టల్ బ్యాలెట్ ఫలితాలు మాత్రం అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తికి స్వల్ప ఆధ్యం కనిపించింది. అయితే వైసీపీ పోస్టల్ బ్యాలెట్ తనకు భారీగా ఆదిక్యం వస్తుందని భావించిన అంతా మెజార్టీ కనిపించకపోవడంతో ఆ పార్టీ కూడా ఏం జరుగుతోందని టెన్షన్ పడుతోంది. తిరుపతిలో ప్రస్తుతానికి 2500లు   ఓట్లు గురుమూర్తికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తిరుపతి నియోజకవర్గంలో భారీగా రిగ్గింగు  జరిగిందని.. దొంగ ఓట్లు పడ్డాయని విపక్షాలు ఆరోపించాయి. కానీ ఆ స్థాయిలో ఓట్లు కనిపించడం లేదు. అయితే సత్య వీడులో మాత్రం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఉన్నారు. ఇది కూడా అధికార వైసీపీ ఊహించలేదు.  బీజేపీ మాత్రం ఎక్కడా ఎలాంటి ప్రభావం చూపించలేకపోతోంది. తొలి రౌండ్ ఫలితాలను చూస్తే ఆ పార్టీ మూడు స్థానానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

    ప్రస్తుతం తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఉప ఎన్నిక కౌంటింగ్ లో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ లను జనరల్ అబ్జర్వర్ దినేష్ పటేల్,కౌంటింగ్ అబ్జ ర్వర్, రాజేంద్ర కుమార్ పట్నాయక్ ల సమక్షం లో తెరచి ఈ విఎం ల ను కౌంటింగ్ హాల్స్ కు తరలించిన తరువాత కౌంటింగ్ ను కొనసాగుతోంది. కానీ ఫలితం మాత్రం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

    తిరుపతి, సత్యవేడు శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లలో కౌంటింగ్  కొనసాగుతుండగా.. తిరుపతిలో వైసీపీ, సత్యవేడులో టీడీపీ ఆధిక్యంలో ఉంది. శ్రీకాళ హస్తిలో రెండు పార్టీలకు సమాన మెజార్టీ వస్తోంది. కౌంటింగ్ ప్రక్రియను  అబ్జర్వర్ దినేష్ పటేల్, కౌంటింగ్ అబ్జర్వర్ రాజేంద్ర కుమార్ పట్నాయక్, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ యం.హరి నారాయ ణన్,తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి నగరపాలక సంస్థ కమి షనర్ గిరీష, తిరుపతి ఆర్డిఓ కనకనర్సారెడ్డి ... తిరుపతి శ్రీకాళహస్తి, సత్యవేడు ఏ ఆర్ వో లు చంద్రమౌళిశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్ర శేఖర్ లు కౌంటింగ్ ప్రక్రియ ను పరిశీలిస్తు న్నారు...

    కొవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ప్రతి కౌంటింగ్ హాల్ లో ఏర్పాట్లు చేశారు.  కౌంటింగ్ సూపర్వైజర్లు,
    కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra, Andhra Pradesh, Ap bjp, Election, Tdp, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు