TIRUPATI TIRUPATI BY ELECTION RESULT YSRCP CANDIDATE GURUMURTHY LEADING IN TIRUPATI BY POLL COUNTING AS TDP AND BJP SHARING SECOND THIRD PLACE FULL DETAILS HERE PRN
TIrupati By Election Result: తిరుపతిలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి...
తిరుపతి ఉప ఎన్నిక తొలి రౌండ్ ఫలితం
ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ తిరుపతిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న తిరుపతి ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి లీడ్ లో ఉన్న గురుమూర్తి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 20 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఉదయం 10గంటల సమయానికి వైసీపీకి 42,985, టీడీపీకి 22,903, బీజేపీకి 3,489, కాంగ్రెస్ కు 538 ఓట్లు పోలయ్యాయి. దీంతో గురుమూర్తి 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో దూసుకెళ్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో తొలి రౌండ్ లో గూడూరు నియోజకవర్గం వైసీపీకి 4,097 ఓట్లు రాగా.. టీడీపీకి 1,211, బీజేపీకి 197 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గురుమూర్తికి 2,500 ఓట్లు దక్కాయి. సూళ్లూరు పేటలో 3 రౌండ్లకు గానీ వైసీపీకి 9,200, తిరుపతిలో రెండు రౌడ్లకు గానీ 6,250, వెంకటగిరిలో 2,250, శ్రీకాళహస్తిలో 1,940 లీడ్ సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.