హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Curfew: ఏపీలో కర్ఫ్యూ వేళ వీళ్ల గురించి మాట్లాడుకోవాల్సిందే..! ఎందుకంటే..

AP Curfew: ఏపీలో కర్ఫ్యూ వేళ వీళ్ల గురించి మాట్లాడుకోవాల్సిందే..! ఎందుకంటే..

పేదలకు అహారం పంపిణీ చేస్తున్న కలాం ట్రస్ట్

పేదలకు అహారం పంపిణీ చేస్తున్న కలాం ట్రస్ట్

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) పాక్షిక లాక్ డౌన్ (Semi Lockdown) విధించిన వేళ నిరాశ్రయులు, యాచకులు పట్టడెన్నం లేక అలమటించిపోతున్నారు.

  దేశ వ్యాప్తంగా కరోనా విజృభిస్తూ....ప్రజలను హడలెత్తిస్తోంది. ఎటు చూసిన కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ.. అందరి మదిలో కలవరానికి గురి చేస్తోంది. పాక్షిక లాక్ డౌన్ కారణంగా పనులు లేకుండా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి వలస కూలీలదైతే.ఎవరో సహాయం చేస్తే తప్ప పొట్ట నిండని నిరాశ్రయులు, అనాధల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు మెతుకుల కోసం బిక్షాటన చేద్దామన్నా.., ఎవరు బయటకి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కో పూట ఒక్కో యుగంగా గడపాల్సిన పరిస్ధితి వస్తోంది. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అన్నదాతలు అవుతున్నారు కొందరు యువకులు. సామాజిక స్పృహ, సమాజంపై బాధ్యత కలిగిన కొందరు యువకులు ఆకలితో అలమటించి పోతున్న కొన్ని వందల మందికి ఆహారాన్ని అందించాలని సంకల్పించారు. రోజువారీ ఖర్చులకు వినియోగించుకొనే డబ్బులతో బాషా సిరివెల్ల మరియు అతని స్నేహితులు కలాం ట్రస్టును ఏర్పాటు చేసారు.

  గతేడాది లాక్ డౌన్ నుంచి ప్రారంభిమైన అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా ఇవాళ్టి వరకు కొనసాగిస్తున్నారు. తిరుపతిలోని ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో ఉన్న కొందరు వృద్దులు, తల్లితండ్రులు లేని చిన్నారులను చూసి వారికీ ఆహారం అందించడం మొదలు పెట్టారు. క్రమంగా చేయి చేయి కలిసినట్లు.., బాషా అండ్-కో తో పాటు మరి కొందరు కలసి వచ్చి వందల మంది ఆకలి బాధలను తీరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, రుయా ఆసుపత్రి, వివిధ వసతి సముదాయాల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం నిత్యం అందిస్తూ వస్తున్నారు. మిత్రుడు నడుపుతున్న ఓ హాస్టల్ లో ఈ బోజనాలను తయారు చేయించి స్కూటర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇక పూటగడవని వలస కూలీలకు సహాయం అందించి వారికీ ఒక పూటైనా ఆహారం అందేలా చేయాలనుకున్నారు. తమకు తెలిసిన వారి వద్ద నుంచి బియ్యం, పప్పు, ఇతర సామాగ్రి సమకూర్చి పేదలకు, వలస కూలీలకు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకడం చాల కష్టంగా మారుతోంది. ఇది గమనించిన ఆ యువత....కరోనా నియమావళి పాటిస్తూ బ్లడ్ క్యాంపు సైతం ఏర్పాటు చేసి అత్యవరస స్థితిలో ఉన్న వారికీ రక్తం అందేలా ఏర్పాటు చేసారు. దాతల సహాయంతో కోవిడ్ బారిన పడ్డ రోగులకు కిట్లను అందజేశారు.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్..


  "మనం రోజు వ్యాచించే జేబు ఖర్చు ఒక్కరోజు మనది కాదు అనుకుంటే... అది ఇద్దరి ఆకలి తీరుస్తుంది. ఇలా మేము రోజువారీగా ఖర్చు పెట్టే డబ్బులలో సగభాగం అన్నదానం చేయడం ద్వారా కొందరి ఆకలిలైన తీర్చ కలుగుతున్నాం. మనకు ఎందుకులే అనుకునేకన్నా మనకు తోచిన విధంగా సహాయం చేయడం మనకు మనస్సు తృప్తిని ఇస్తుంది. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం అయ్యే కార్యక్రమం కాదు. నాతో పాటు నా మిత్రుల ఆలోచనలు కలిసాయి కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆకలితో పస్తులు ఉండే వారికీ పట్టెడు అన్నం దొరికితే వారి కళ్ళలో కనిపించే సంతోషం నాకు మహదానందాన్ని కలిగిస్తోంది.." అని కలాం ట్రస్ట్ ప్రతినిథులు చెప్తున్నారు.

  ఇది చదవండి: 30 ప్రాణాలు నిలబెట్టిన పోలీసులు.. చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే..

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona, Lockdown

  ఉత్తమ కథలు