Tirumala : మీరు తిరుమలకు వెళ్లాలి అనుకుంటున్నారా? శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారా? అయితే.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్తగా తీసుకున్న నిర్ణయం గురించి మీకు తెలియాలి. అదేంటంటే.. డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని టీటీడీ నిర్ణయించింది. నెల పాటు ఉదయం 8 గంటలకే బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తుంది. ఇదో ప్రయోగాత్మక పరిశీలన మాత్రమే. ఇది సక్సెస్ అయితే.. అప్పుడు కంటిన్యూ చెయ్యాలనేది పాలక మండలి అభిప్రాయంగా తెలుస్తోంది.
తిరుమలలో మార్పులూ - చేర్పులూ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఏం చేసినా భక్తులకు వీలైనంత త్వరగా, ఎక్కువ సేపు స్వామి వారిని చూసేందుకు అవకాశం కల్పించడమే ధ్యేయం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధానంగా కొండకు వచ్చే వారిలో సామాన్య భక్తులే ఎక్కువ. ఐతే.. వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల తరచూ సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలుగుతోంది. వీఐపీలు వచ్చి.. వెళ్లిపోయేవరకూ.. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగట్లేదు. ఈ విషయంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో చూడాలని భావించిన పాలక మండలి.. ఈ ప్రయోగం చేస్తోంది.
Mangli : TTD - SVBC సలహాదారుగా మంగ్లీ.. బాధ్యతలు స్వీకరించిన సింగర్
ప్రస్తుతం ఎలా?
ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం ఉదయం 5 గంటల నుంచి 5.45 వరకూ నిర్వహిస్తున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 6.30 నుంచి 7 వరకూ నిర్వహిస్తున్నారు. అలాగే.. శుక్రవారం ఉదయం 8 నుంచి 8.30 వరకూ... శని, ఆది వారాల్లో ఉదయం 5 నుంచి 5.30 వరకూ ఉంటుంది. తాజా మార్పుతో.. నెలపాటూ.. అన్ని రోజులూ ఉదయం 8 గంటలకే నిర్వహించడం వల్ల.. సామాన్య భక్తులు.. ముందుగానే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Telugu news, Tirumala, Ttd