Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI HUNDI CREATS NEW RECORDS JULY ALLREADY GET 100 CRORE INCOME NGS TPT

Tirumala: టీటీడీ సరికొత్త రికార్డు.. కేవలం 20 రోజుల్లో వచ్చిన ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

శ్రీవారి భక్తులు.. శుభవార్త

శ్రీవారి భక్తులు.. శుభవార్త

Tirumala: సీజన్ తో సంబంధం లేకుండా తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఒకప్పుడు వీకెండ్ లో ఉండే భక్తులు.. ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ అలాగే కనిపిస్తున్నారు. అదే స్థాయిలో హుండీ ఆదాయం వస్తోంది. తాజాగా టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు నమోదు అయ్యింది. కేవలం 20 రోజుల్లో ఎంత ఆదాయం వచ్చిందంటే..?

ఇంకా చదవండి ...
    Tirumala: ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple). కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల‌ పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో‌ జన్మల పుణ్యఫలం. అందుకే అ తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది.. అందుకే కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) ని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో కేవలం కొన్ని సీజన్లలో మాత్రమే భారీగా భక్తులు వచ్చేవారు.. వేసవి సెలవుల్లోనూ.. ప్రత్యక దినాల్లో అనూహ్యంగా భక్తుల రద్దీ ఉండేది.. ఇక మిగిలిన సీజన్లలో కేవలం వారంతాల్లో భారీగా రద్దీ ఉండేది.. కానీ కరోనా నుంచి పూర్తిగా రాష్ట్రం కోలుకున్న తరువాత.. తిరుమల (Tirumala) కొండకు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఓ వైపు వానలను లెక్క చేయడం లేదు.. స్కూళ్లు ఓపెన్ అయిన తరువాత రద్దీ తగ్గడం లేదు.. కేవలం వీకెండ్స్ లోనే కాదు.. సాధారణ రోజుల్లోనూ శ్రీవారి దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది అంటే.. భక్తులు ఏ స్థాయిలో వస్తున్నారో ఊహించవచ్చు. అయితే అదే స్థాయిలో.. శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. జులై నెలలో టీటీడీలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.

    శ్రీవారి భక్తులు కోనేటి రాయుడికి.. జులై నెలలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కాసుల వర్షం కురిపించారు భక్తులు. ఈనెల శ్రీవారి ఆదాయం ఇప్పటికే 100 కోట్ల మార్క్‌ను దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఊహించని స్థాయిలో ఆదయం పెరగడంపై టీటీడీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.


    మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. దాదాపు రెండేళ్ల తరువాత తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. జులై 1వ తేదీనుంచి జులై 21వ తేదీ వరకు శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. తిరుమల చరిత్రలో అత్యధిక ఆదాయం ఈ నెలా ఖరులోపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి : ఆమెకు 35.. ప్రియుడుకి 18.. రెండు నెలలు ఆగలేక అంత పని చేశారా?మురళి మిస్సింగ్ కేసులో ట్వీస్ట్

    ఇప్పటి వరకు గత మే నెలలో వచ్చిన 130 కోట్ల రూపాయలే అత్యధిక ఆదాయంగా ఉండేది.. అయితే జులై 31 నాటికి 140 కోట్ల రుపాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గత ఐదు నెలలుగా స్వామివారి ఆదాయం 100 కోట్ల మార్కును దాటి ఆదాయం వస్తోందని అధికారులు వివరించారు. ఈఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు.. ఏప్రిల్ నెలలో 127.5 కోట్లు.. మే నెలలో 130.05 కోట్లు.. జూన్ లో 123 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జులై మాసంలో ఇప్పటికే స్వామి వారి ఆదాయం 100 కోట్ల 5 లక్షలుకు చేరింది.. ఇంకా పదిరోజులపైనా ఉండడంతో ఆదాయం రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.

    ఇదీ చదవండి: పుష్ప కావడిలో మొక్కులు చెల్లించిన రోజా..? అసలు పుష్పకావడి ప్రత్యేకత ఏంటి అంటే..?

    టీటీడీ చరిత్రలో ఈ జులై నెల4 వతేదీన అత్యధికంగా రూ. 6.18 కోట్లు ఆదాయం లభించింది. ఈ నెలలో ఇంకో పదిరోజులు హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా కొత్త చరిత్ర సృష్టిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదు నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.650 కోట్లను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదాయం 1500 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirupati, Ttd news

    తదుపరి వార్తలు