• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM TO SERVE ORGANIC PRODUCTS BASED NAIVAEDYAM TO SRI VENKATESWARA SWAMY FROM FRIDAY ON WORDS FULL DETAILS HERE PRN TPT

Tirumala Temple: శ్రీవారికి ప్రకృతిసిద్ధ నైవేద్యం... ఏళ్లనాటి సాంప్రదాయం మళ్లీ ప్రారంభం

Tirumala Temple: శ్రీవారికి ప్రకృతిసిద్ధ నైవేద్యం... ఏళ్లనాటి సాంప్రదాయం మళ్లీ ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల (Tirumala) శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో టీటీడీ (TTD) మార్పులు చేస్తోంది. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించనుంది.

  • Share this:
    బ్రిటీష్ కాలం‌ నాటి సాంప్రదాయంకు టిటిడి శ్రీకారం చుట్టింది.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో నేటి నుండి నైవేద్యం తయారు చేసి శ్రీవారికి సమర్పించనుంది టిటిడి. స్వామి వారి నైవేద్యంకు కావాల్సిన బియ్యంను అందజేసిన విజయరాం అనే భక్తుడు. ఏడాదిలో రోజుకో రకం చొప్పున 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించనున్నారు. టిటిడి కావాల్సిన బియ్యం అందితే భవిష్యత్తులో రైతుల వద్ద నుండి బియ్యంను నేరుగా కొలుగోళ్ళు చేసెందుకు టిటిడి భవిష్యత్ కార్యచరణ రూపోందించనుంది.. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి దర్శనార్ధం దేశ,విదేశాల నుండి వస్తుంటారు. గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు. వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఏడు కొండలు గొవింద నామస్మరణలతో మారుమ్రోగుతుంటుంది‌. స్వామి వారు ఎంతటి అలంకార ప్రియుడో.., అంతటి నైవేద్య ప్రియుడు కూడా.

    అందుకే శ్రీవారి ఆలయంలోని నైవేద్య పోటులో సాంప్రదాయబద్దంగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తుంటారు అర్చకులు. పూటకొక్క వంటకంతో స్వామి వారికి ఎంతో భక్తి భావంతో అర్చకులు నైవేద్యాలు సమర్పిస్తూ..స్వామి వారిని సంతృప్తి పరుస్తారు. అయితే గతంలో ఆనవాయితీగా 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించే వారు. ఆ తర్వాత ఈ పద్ధతి నిలిచిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇది చదవండి: ఫిబ్రవరి వరకు ఈ కష్టం తప్పదు.. కొవిడ్ వ్యాక్సిన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు..


    దేశంలోనే అతి పెద్ద ధార్మిక సంస్దగా టీటీడీ పేరుపొందింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన వడ్డి కాసులవాడి ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో) గా మార్చింది. బ్రిటీష్ వారి పాలనకు ముందు 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించే విధానంను అనుసరిస్తుండగా, కాలక్రమేణ ఈ సంప్రదాయానికి అప్పటి పాలకులు స్వస్తి పలికారు.

    ఇది చదవండి: వైఎస్ఆర్ రైతు భరోసా నమోదుకు ఇంకా రెండు రోజులే.. ఇలా దరఖాస్తు చేసుకోండి...


    అయితే శ్రీవారి ఆలయంలో స్వయంబుగా కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే నేవేధ్యాలు అన్ని ఇన్ని కావు.. నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు అర్చకులు.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా పండిన బియ్యంతో తయారు చేయబడిన నైవేద్యాన్ని సమర్పించే క్రతువు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభం‌కానుంది. ఇందుకు కావాల్సిన దేశీయ వంగడాల బియ్యంను కృష్ణా జిల్లా, గూడూరు మండలం, పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు ప్రకృతి వ్యవసాయవేత్త ఎం. విజయరాం ఈ సాంప్రదాయంకు తిరిగి రూపకల్పన చేశారు. గురువారం‌ మధ్యాహ్నం కృష్ణా జిల్లా నుండి 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం తిరుమలకు చేరుకుంది. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యం, కూర‌గాయ‌లను టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డికి తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ ఈ మేర‌కు బియ్యం, కూర‌గాయ‌ల‌ను శ్రీ‌వారి ఆల‌యం ఎదుట టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

    ఇది చదవండి: పల్లెల కోసం సీఎం జగన్ కొత్త పథకం.. వైఎస్ఆర్ జయంతిరోజే లాంఛింగ్


    గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యంతో శ్రీ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించాల‌ని రైతు విజ‌య‌రామ్ టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోను సంప్ర‌దించార‌ని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేర‌కు మొద‌ట‌గా 10 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం పెట్టే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి గానూ 2,200 కిలోల బియ్యం, కూర‌గాయ‌లు, అర‌టిపండ్లు, బెల్లం, 15 కిలోల దేశీయ ఆవు నెయ్యి అందించార‌ని తెలిపారు. ఈ బియ్యంలో ప్రొటీన్లు, ఫైబ‌ర్, విట‌మిన్లు పుష్క‌లంగా ఉన్నాయ‌న్నారు. శుక్రవారం నుంచి ఈ బియ్యంతో త‌యారు చేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు.

    ఈ బియ్యం కావాల్సిన మోతాదులో దొరికితే రైతుల నుండే నేరుగా సేక‌రించి స్వామివారికి నైవేద్యంతో పాటు భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి కూడా వినియోగిస్తామ‌న్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడ‌కుండా పండించిన‌ ఇలాంటి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వాడితే ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ని తెలిపారు. రైతు విజ‌య‌రామ్ మాట్లాడుతూ.. శ్రీ‌వారికి 365 రోజుల పాటు 365 ర‌కాల దేశీయ వ‌రి వంగ‌డాల బియ్యంతో నైవేద్యం స‌మ‌ర్పించే అవ‌కాశం క‌ల్పించాల‌ని టిటిడిని కోరారు. గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా భూమి సార‌వంత‌మ‌వుతుంద‌ని, ఇలాంటి ఉత్ప‌త్తుల‌ను స‌మాజంలోని ప్ర‌జలంతా వినియోగించాల‌ని కోరారు..ఇందుకు దేశంలో ఉన్న ప్రకృతిసిద్ధ విత్తన ఉద్యమకారుల సహకారం తీసుకుంటున్నామని, పశ్చిమ బెంగాల్ కు చెందిన అనుమపస్వామి నుంచి 30 నుంచి 40 రకాలు, ఒడిశాకు చెందిన సబర్మతి నుంచి 10 రకాల ప్రకృతి సిద్ధ బియ్యాన్ని సేకరించి అందించనున్నట్లు తెలిపారు.

    ముఖ్యంగా తిరుమలకు 15 రకాల వరి బియ్యం పంపించిన వాటిలో బహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరు సన్నం, రాజ్బోగ్, రాజుడి, చిట్టి ముత్యాలు, బాస్బోగ్, తులసీబాసు, గోవింద్బోగ్, లాల్ చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ రకాలు ఉన్నాయి. వీటిని వికారాబాద్, గూడూరు మండలం పినగూడూరు లంక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పండించినవిగా వివరించారు.
    Published by:Purna Chandra
    First published: