Tirumala Temple: తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు.. వివరాలివే..!

తిరుమల శ్రీవారు (ఫైల్)

Tirumala Prasadam: శ్రీవారి ఆలయం తరువాత అంత పవిత్రంగా భావించే అన్నదానం సత్రంలో టీటీడీ పంపిణీ చేసే అన్నప్రసాదాని భక్తులు వేంకటేశ్వరస్వామి దివ్యప్రసాదంగా భావించి భుజిస్తారు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు కొండకు తరలివస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నా తిరుమల క్షేత్రానిది మాత్రం ప్రత్యేక స్థానం. అత్యధిక సంఖ్యలో హిందువులు ఆరాధించే ఆలయం తిరుమల. ఇతంటి విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన క్షేత్రానికి వచ్చే అనంత భక్తకోటి ఆకలి భాదలు తీరుస్తున్నది స్వామి వారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం. తిరుమలలో అన్నదానాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వందేళ్ల క్రితం తిరుమలలో రోడ్లపైనే అన్నదానం ఏర్పాటు చేసేవారు. అప్పట్లో రోజుకు వందల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే వారు. మొదటగా వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి వకుళామాత అన్నదానం చేసిందని శాసనాల ద్వారా తెలుస్తుంది. అందుకే నేటికి అన్నప్రసాద కేంద్రంలో వకుళామాతకు నిత్యం పూజలు చేస్తుంటారు. ముందుగా తయారు చేసిన ఆహారాన్ని నైవేద్యంగా నివేదిస్తుంటారు. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు అన్నప్రసాదాన్ని తినకుండా తిరిగిరాడు.

  శ్రీవారి ఆలయం తరువాత అంత పవిత్రంగా భావించే అన్నదానం సత్రంలో టీటీడీ పంపిణీ చేసే అన్నప్రసాదాని భక్తులు వేంకటేశ్వరస్వామి దివ్యప్రసాదంగా భావించి భుజిస్తారు. ఆసలు విషయానికి వస్తే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉచిత అన్నదాన సత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనమే. అందుకేనేమో సామాన్య భక్తులే కాదు విఐపిలు కూడా అన్నప్రసాదకేంద్రంలో భక్తులకు అన్నం వడ్డించటానికి క్యూకడుతుంటారు. ఈ జాబితాలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మెగాస్టార్ చిరంజీవి, క్రికెట్ దిగ్గజం వివియస్ లక్ష్మణ్ లాంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. సామాన్య భక్తులతో పాటు వడ్డించటమే కాకుండా వారితో పాటు కలిసి భోజనం చేస్తారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ 'సంప్రదాయ భోజనం అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

  ఇది చదవండి: మంత్రుల సేవలో టీటీడీ... సామాన్య భక్తులను పట్టించుకోరా..?


  ఇప్పటికే ఏప్రిల్ నుంచి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పుదినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత అన్నప్రసాద వితరణతో పాటు గోఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్ధాలతో ప్రసాదం తయారు చేసి భక్తులకు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనేత కృష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 30న ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సూచనలతో ఈ కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. 14 రోజులకు 14 రకాల కూరగాయలతో వంటలు చేసి వడ్డించేలా మెనూ సిద్ధం చేశారు.

  ఇది చదవండి: రూ.150 కోట్ల చేరుకున్న శ్రీవాణి ట్రస్ట్...! భక్తుల విరాళాలతో టీటీడీ ఏంచేస్తోందంటే..!


  బహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరి సన్నం, రాజ్బోగ్, రాజాముడి, చిట్టిముత్యాలు, బాస్బోగ్, తులసీ బాసు, గోవింద్బోగ్, లాల్ చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ వంటి దేశీయ వరి బియ్యాన్ని సంప్రదాయ భోజన తయారీకి వినియోగించనుంది టిటిడి.. ఈ కార్యక్రమానికి అవసరమైన ముడిసరుకుల సరఫరా కోసం కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్ద నుండి సమకూర్చనున్నారు.. రైతులు పండించిన పంటలను నేరుగా టీటీడీయే కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు..ప్రస్తుత్తం కోవిడ్ నేపధ్యంలో సరిమిత సంఖ్యలోనే టిటిడి దర్శన టిక్కేట్లు జారీ చేస్తున్న విషయం విధితమే..ఈ నేపధ్యంలో స్వామి వారి భక్తులకు సాంప్రదాయ భోజనంను ప్రవేశ పెట్టి అటుతరువాత కూడా ఇదే సాంప్రదాయ భోజనంను కోనసాగించే విధంగా టిటిడి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అన్నదానసత్రంలో సాంప్రదాయ భోజనంను ప్రవేశపెట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: