హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారు.. ముఖ్యమైన ఘ‌ట్టాలు ఏంటి.. ఎప్పుడు..? వాటి ప్రయోజనాలు ఇవే

Tirumala: బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారు.. ముఖ్యమైన ఘ‌ట్టాలు ఏంటి.. ఎప్పుడు..? వాటి ప్రయోజనాలు ఇవే

బ్రహ్మోత్సవాల్లో సేవలు ఏంటి..? ఎలా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో సేవలు ఏంటి..? ఎలా నిర్వహిస్తారు.

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వ సిద్ధమైంది.. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టాలు ఏంటి.. ఏ సేవ ఎందుకు..? ఎలా నిర్వహిస్తారో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18.

Tirumala:  కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి  (Lord Venkateswara Swamy) వెలసిన‌ తిరుమల (Tirumala) దివ్య క్షేత్రంలో నిత్యకల్యాణం పచ్చతోరణం అన్న‌విధంగా అనుదినం ఒక ఉత్సవమే. స్వామివారికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరుపుతారు. అన్ని ఉత్సవాల్లోకెల్లా అలంకారప్రియుడికి అత్యంత ప్రియమైన ఉత్సవం బ్రహ్మోత్సవం (Brahmotsavam) అంటారు. తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా భాద్రపదం, ఆశ్వయుజ మాసాల సమయంలో  విజయదశమి వరకు నవాహ్నికంగా నిర్వహించే ఉత్సవాలనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) ఏర్పాట్లు చేపడుతోంది.

ఈ తొమ్మిది రోజుల ఉత్స‌వాల్లో శ్రీ‌వారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామివారు వివిధ ర‌కాలైన 16 వాహ‌నాల‌పై (రెండు ర‌థాలు క‌లిపి) మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మైన కార్యక్రమాల సరళి ఈ విధంగా ఉంటుంది.

ఆలయశుద్ధి :

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వైఖాన‌స ఆగ‌మం ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి (కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం) చేస్తారు.

ఇదీ చదవండి : మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మృత్సంగ్రహణం :

బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందునాడు పుట్టమన్ను సేకరించి భూమాతకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు  మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. తదుపరి విష్వక్సేన, అనంత, సుదర్శన, గరుడాళ్వార్‌లను పూజిస్తారు.

ఇదీ చదవండి : వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు

ధ్వజారోహణం మరియు దేవతావాహనం:

శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయం లోపల నడిమి పడికావలి చెంత అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి అత్యంత ప్రియు సఖుడైన గరుడుడు బ్రహ్మ, ఇంద్ర, యమ, అగ్ని, కుబేర, వాయు తదితర దేవతలనే కాకుండా వశిష్ట, విశ్వామిత్రాది సప్తఋషులను, ఇతర గణాలను, దేవతలను ఆహ్వానిస్తారని ప్రతీతి. దీనినే దేవతావాహనం అంటారు.

ఇదీ చదవండి: వేలు పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం.. ఈ దిశలో నాటితే.. ఎవరికైనా డబ్బే డబ్బు

వాహనసేవలు :

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వన్నె చేకూర్చేవి వివిధ వాహనసేవలు. అలంకార తేజోవిలాసుడైన శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలు క‌లిపి 13 వాహనాలపైనే కాకుండా మోహినీ అవతారం, స్వర్ణరథం, రథోత్సవాల్లో కూడా తిరుమాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు. ఒక్కొక్క వాహనం ద్వారా భక్తజన కోటికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు.

ఇదీ చదవండి: బ్రహ్మంగారి మాటే నిజమవుతోందా..? 2 తలలతో పుట్టిన దూడ.. వినాయకుడి వరం అంటూ పూజలు

శ్రీవారి కొలువు :

శ్రీవారి ఆలయం లోపల బ్రహ్మోత్సవాల వాహనసేవల సమయంలో కొలువు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ అర్చకులు ఈ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు.

ఇదీ చదవండి: వరుసాగా ఆరో నెల రికార్డ్ బ్రేక్.. తొలిసారి ఆ మార్క్ దాటిన ఆదాయం.. ఎంతో తెలుసా?

స్నపనం :

ఈ కార్యక్రమాన్నే ఉత్సవానంతర స్నపనంగా వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం ఒక వాహనసేవ తిరిగి రాత్రి ఒక వాహనసేవతో క్షణం తీరిక లేకుండా ఉండే మలయప్పస్వామివారికి రెండు వాహనసేవల మధ్య సమయంలో నిర్వహించే ప్రత్యేక సుగంధద్రవ్య అభిషేకమే స్నపనం. తద్వారా స్వామివారికి ఉపశమనం కలిగించి తిరిగి రాత్రి వాహనానికి నూతనోత్తేజంతో, ఉత్సాహంతో వాహనాన్ని అధిరోహించేందుకు సంసిద్ధం చేస్తుంది.

ఇదీ చదవండి: కుటుంబమంతా రోజూ అదే స్కూలుకు వెళ్తారు.. మూడు తరాలు ఒకే పాఠశాలలో ఎలా సాధ్యం..?

చూర్ణాభిషేకం:

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజు ఉదయం స్వామి, అమ్మవార్లకు సుగంధద్రవ్యంతో ఆచరించే స్నానమే చూర్ణాభిషేకం.

ఇదీ చదవండి : ఆ రిజర్వాయర్‌ నీళ్లు కావాలంటే రైతులు చందాలు వేసుకోవాలా..? ఎందుకో తెలుసా..?

చక్రస్నానం:

బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి పుష్క‌రిణిలో శ్రీవారి సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: వజ్రాల వేటకు వెళ్తున్నారా.. బీకేర్ ఫుల్.. ఆ పని చేస్తే కఠిన చర్యలు..!

దేవతోద్వాసన :

చివ‌రిరోజు స్వామివారికి అర్చన నివేదించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముక్కోటి దేవతలకు, ఋషిపుంగవులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు ప‌లుకుతారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించిన బ్రహ్మదేవునికి కూడా అర్చకస్వాములు సంబంధిత శ్లోకాల‌తో కృతజ్ఞతలను నివేదిస్తారు.

ఇదీ చదవండి: మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే

ధ్వజావరోహణం:

బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం ధ్వజావరోహణం. ఆలయ ధ్వజస్తంభంపై తొలిరోజు రెపరెపలాడిన గరుడధ్వజ చిత్రపటాన్ని చివరిరోజు సాయంత్రం అవనతం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

ఉత్తమ కథలు