TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM NEWS KALYANAMASTHU FUNDS FOR POOR PEOPLE NGS TPT
Kalyanamasthu: పేదల పాలిట బంగారు తలంబ్రాలుగా మారుతున్న కల్యాణ మస్తు..! ఎప్పుడంటే..?
పేదవారికి వరంగా మారిన కళ్యాణమస్తు
Tirumala Tirupati Devastanam: కలియుగ దైవం.. ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడు సన్నిధిలో కాసేపు కూర్చోవాలి అంటే... ఎంతో అదృష్టం ఉండాలి అంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏకం పేదల కోసం కళ్యాణమస్తు పేరుతో అద్భుత కానక అందిస్తోంది..
Tirumala Tirupati Devasthanam: కలియుగ దైవం.. శ్రీవారి అనుగ్రహంతో.. వివాహం చేసుకోవాలని అందరూ ఆశిస్తారు. ఆయితే శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం (Marriage) చేసుకోవాలనుంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటారు.. ఆ అదృష్టాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) పేదలకు అందిస్తోంది. గోవిందుడు అందరి వాడే అంటూ.. పేదలకు తన కటాక్షం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని వందల జంటలు కల్యాణ మస్తు కార్యక్రమం ద్వారా ఒక్కటి అవ్వనున్నాయి. కళ్యాణమస్తు (Kalyanamasthu) కార్యక్రమం పునః ప్రారంభానికి టీటీడీ (TTD) సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ. వచ్చే ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Sri Venkateswara Swamy) ఆశీస్సులతో ఉచితంగా వివాహాలను జరిపించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారు.
అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
కల్యాణ మస్తు కార్యక్రమం నిజానికి ఇప్పుడు తీసుకొచ్చిన నిర్ణయంకాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ఉన్న సమయంలో ఈకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేసిన.... 2007 ఫిబ్రవరి 21వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. అప్పట్లో ఒక్కో జంటకు 7 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడి. దింతో ఖర్చు సుమారు 24 కోట్ల రూపాయలు అయ్యాయని అంచనా. బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది.
వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు, తల్లిదండ్రులు లేని అనాథలు కూడా ఈ కార్యక్రమంతో లబ్ధి పొందేవారు. అప్పట్లో ఏడాదికి ఒక మారు మాత్రమే టీటీడీ ఈ మార్యక్రమాని నిర్వహించేది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మారిని ప్రభుత్వాలు.. పాలక మండళ్ల కారణంగా కల్యాణ మస్తు కార్యక్రమం మరుగున పడింది. 2011 మే 20న కళ్యాణమస్తూ చివరి విడత కళ్యాణమస్తు నిర్వహించింది. 2021వ సంవత్సరంలోనే టీటీడీ కల్యాణ మస్తు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లు వేదికలను సైతం సిద్ధం చేసింది. పదేళ్ల అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపం లేకుండా జయప్రదం చేయాలని నిశ్చయించుకుంది. గతేడాది మే 28 మధ్యాహ్నం 12.34 నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు ముహూర్తాలు ఖరారు చేశారు.
అదే సమయంలో కరోనా మహమ్మారి పంజా విసిరింది. దింతో కళ్యాణమస్తు కార్యక్రమం వాయిదా పడింది. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి సీఎం ఉండగా, టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు పేరు మీదుగా ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని గుర్తు చేశారు.
ఆయన మరణం తరువాత ఈ కార్యక్రమం అర్థాంతరంగా నిలిపి వేశారని, వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణమస్తు కార్యక్రమంను పునః ప్రారంభించాలని తమ పాలకమండలి నిర్ణయం తీసుకుందని టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు.. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.