హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Darshan Controversy: మంత్రుల సేవలో టీటీడీ... సామాన్య భక్తులను పట్టించుకోరా..?

Tirumala Darshan Controversy: మంత్రుల సేవలో టీటీడీ... సామాన్య భక్తులను పట్టించుకోరా..?

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

Tirumala: భక్తులకు సులభంగా దర్శం కల్పించాల్సిన టీటీడీ.. (TDD)వీఐపీల సేవలో తరిస్తోంది. సామాన్య భక్తులకే మా మొదటి ప్రాధాన్యత అని టీటీడీ చెప్పినా అవి నీటిమీద రాతల్లాగానే మారుతున్నాయి.

  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు భారీగా తరలివస్తుంటారు. క్షణకాలంపాటు శ్రీవారిని దర్శించుకొని తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తిరుమల కొండకు తరలివస్తుంటారు. అలాంటి భక్తులకు సులభంగా దర్శం కల్పించాల్సిన టీటీడీ..వీఐపీల సేవలో తరిస్తోంది. సామాన్య భక్తులకే మా మొదటి ప్రాధాన్యత.. వారికీ త్వరగతిన శ్రీవారి దర్శనం చేయించడమే మా ప్రభుత్వ లక్ష్యం..ఇవి ఎవరో అన్న మాటలు కాదు...సాక్ష్యత్తు టీటీడి చైర్మన్ గా రెండవ సారి బాధ్యతలు స్వీకరించిన నాడు వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు. ఐతే ఇవి మాటలకే పరిమితం అవుతున్నాయి. అచరణలో మాత్రం మాన్యులే మాకు అసమాన్యులు.., వారికే సాగిలపడి సేవలు చేయడమే మా లక్ష్యం అన్నట్లు తయారు అవుతోంది టిటిడి పరిస్ధితి. కోవిడ్ కారణంగా గతేడాదిన్నర కాలంగా తిరుమలలో పరిస్ధితులన్ని పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీవారి ఆలయంలో దాదాపు 80 రోజులు పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన టీటీడి.. అటు తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులతో పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది టీటీడి.

  ఇక కరోనా సెకండ్ వేవ్ ఉదృత్తి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేది నుంచి సర్వదర్శనం భక్తులకు జారి చేసే టోకేన్లను కూడా టీటీడి నిలిపివేసింది. అప్పటినుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కూడా పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తోంది. పరిమిత సంఖ్యలోనే టీటీడి టిక్కెట్లను జారీ చేస్తుండగా... ఈ విప్తతుకాలంలో స్వామి వారిని దర్శించుకున్నేందుకు టిక్కెట్లు లేక పోయినప్పటికీ ఎలాగైనా స్వామి వారిని దర్శించుకోవాలన్న తపనతో కొందరు భక్తులు టిక్కెట్లు లేనప్పటికీ తిరుపతికి చేరుకొని తిరుమలకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో స్వామి వారి దర్శనార్దం విచ్చేసే భక్తులను అలిపిరి వద్దే తనిఖి చేసి కేవలం టిక్కెట్ల ఉన్న భక్తులను మాత్రమే టీటీడి తిరుమలకు అనుమతిస్తోంది.. ఇలా సామాన్యులు విషయంలో కోవిడ్ నిభందనలను తూచా తప్పకూండా పాటిస్తూ వస్తున్న టీటీడి.. ప్రముఖుల విషయంలో మాత్రం కోవిడ్ నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా వాటిని నీటిపై రాతలుగా మార్చేసింది.

  ఇది చదవండి: గండికోటలో ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్... డార్లింగ్ వస్తున్నాడా..?


  కోవిడ్ ఆంక్షలు పేరుతో గత ఐదు నెలలుగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాని దూరం చేసిన టీటీడి.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు మాత్రం సాగిలపడి సేవలు చేస్తొంది. సాధారణంగా టీటీడి నిబంధనలు మేరకు ఓ సిఫారస్సు లేఖపై ఆరుకు మించి టిక్కెట్లు చేయదు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారులు ఈ నిబంధనలను మూలనపడేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు కోసం చేస్తున్న ఒత్తిళ్ళుకు టీటీడి అధికారులు తలొగ్గి నిబంధనలకు తిలొదిక్కాలిస్తూ పరిమితికి మించి దర్శన టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఇష్టానుసారం దర్శన టిక్కెట్లను జారీ చేయడమే కాకుండా వీరితో పాటు వచ్చే అనుచరులకు కూడా ప్రోటోకాల్ మర్యాదలతో స్వామి వారి దర్శనం కల్పిస్తొంది టీటీడి.

  ఇది చదవండి: సీఎం జగన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు.. జగనన్నకు రాఖీ కట్టిన మంత్రులు


  ఇలా ఈ నెలలోనే బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, కుటుంబ సభ్యులతో పాటుగా మరో 35 మంది అనుచరులతో కలసి ప్రోటోకాల్ బ్రేక్ లో స్వామి వారిని దర్శించుకోగా.., మరుసటి రోజే ఏపి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన కుటుంబ సభ్యులతో పాటు ఏకంగా 55 మంది అనుచరులతో కలిసి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకున్నారు. మీకంటే తాను ఏమి తక్కువన్నట్లుగా శుక్రవారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏకంగా 67 మందితో కలిసి ప్రోటోకాల్ దర్శనాన్ని పొందారు.

  ఇది చదవండి: మత్స్యకారుడికి జాక్ పాట్.. వలకు చిక్కిన లక్షరూపాయల చేప... దాని స్పెషాలిటీ ఇదే..!


  శుక్రువారం నాడు శ్రీవారి మూలమూర్తికి అభిషేక సేవ జరుగుతుండడంతో ఉదయం 9గంటల తరువాతే భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉండడంతో శుక్రువారం నాడు సిఫారస్సు లేఖలపై స్వయంగా ప్రముఖులు వస్తే కానీ టిక్కెట్లను కేటాయించదు టీటీడీ. అందులోను ప్రముఖుడు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలను కేటాయిస్తారు..ఇక శ్రుకువారం నాడు మాత్రం సిఫారస్సు చేసే వారికి వారి సిఫార్సులపై దర్శనాలను కేటాయించరు. అలాంటిది తమ శాఖకు చెందిన మంత్రే రావడంతో అధికారులు ఈ నిభంధనలను ప్రక్కన పెట్టేశారు. 10 కాదు, 20కాదు, ఏకంగా 67 టిక్కెట్లను జారీ చేయడమే కాకుండా అందరి కంటే ముందు మంత్రిని ఆయన పరివారాన్ని ఆలయంలోకి పంపించి ప్రోటోకాల్ మర్యాదలతో స్వామి వారి దర్శనాని కల్పించింది టిటిడి.

  ఇది చదవండి: ఆస్పత్రికి వెళ్లకుండానే వైద్యం.. ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రయోగం.. అది ఎలాగంటే..!


  భక్తులకు మాత్రం ఓ సిఫార్సు లేఖపై కేవలం 6 బ్రేక్ దర్శన టిక్కెట్లను మాత్రమే జారీ చేసే టీటీడి.. తమ కుటుంబ సభ్యులలో ఒక్కరిద్దరు అదనంగా ఉన్నారు దర్శనం కల్పించాలని ఎంత విన్నవించుకున్నా ఒక్క సిఫారస్సు లేఖపై 6మందికి మాత్రమే దర్శన టిక్కెట్లను కేటాయించే టీటీడి.. ప్రముఖులకు మాత్రం ఆ నిబంధనను మరచి టిక్కెట్లను లెక్కు మించి జారీ చేయడంపై భక్తులు మండి పడుతున్నారు. తమకో న్యాయం ప్రముఖులకు మరోక్క న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల టైమింగ్స్ పై అప్ డేట్.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు


  కోవిడ్ వ్యాప్తి నివారణ అంటూ సామాన్య భక్తులకు కేటాయించే సర్వదర్శనం టోకెన్లను కూడా గత ఐదు నెలలుగా నిలిపివేసిన టీటీడి.. ప్రముఖులకు మాత్రం నిత్యం ఇలా వందలాదిగా దర్శనం టిక్కెట్లు కేటాయిస్తే కోవిడ్ వ్యాప్తి ఉండదా అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందేంటి అని ప్రశ్నించిన మీడియాపై ఇంటెలిజెన్స్ పోలీసుల వద్ద నుండి ఎస్బి పోలీసుల వరకూ విచారణ చేపడుతున్నారు. మీకేంటి సంబంధం అని మీడియా పోలీసులను అడిగినా పొంతన లేని మాటలను చెబుతూ తప్పించుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై కూడా పోలీసుల వద్ద నుండి ఒత్తిడులకు, బెదిరింపులకు గురి చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: అన్నయ్యకు ప్రేమతో... మెగాస్టార్ కు పవర్ స్టార్ బర్త్ డే విషెస్..


  వైసీపి అధికారంలోని వచ్చిన నాటి‌ నుండి టీటీడీ నిబంధనలన్నీ పూర్తిగా మారిపోయాయి. సామన్య భక్తులకు పెద్దపీఠ వేస్తాం అని ప్రకటించిన‌ పాలక మండలే ఆ మాటలను మరిచి ప్రముఖుల సేవలో తరలిస్తోంది. ఇలా‌ ప్రముఖుల ఇస్తున్న సిఫార్సు లేఖలు మొదలు కొని, వారికి కేటాయించే ప్రోటోకాల్ దర్శనం వరకూ లెక్కకు మించి టిక్కెట్లను కేటాయిస్తోంది. దీంతో రోజు రోజుకు ప్రముఖుల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి కారణంగానే వారి ఒత్తిడులకు తలొగ్గి టీటీడి అదికారులు నిబంధనలకు విరుద్దంగా వారీతో పాటు వారీ అనుచరులకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తూన్నారు. ఇక ప్రజాప్రతినిధులు వి.ఐ.పి బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు చేసే లెటర్స్ విషయంలోను ఇదే తంతు కొనసాగుతోంది.

  ఇది చదవండి: ఏపీలో ఆ ఇద్ద‌రు నేత‌లు ఏమ‌య్యారు..? వారి మౌనం వెనుక కారణం ఇదేనా..?


   అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా తాము కోరుకున్న టిక్కెట్లును జారీ చేయాలంటూ ప్రతి రోజు టీటీడి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతోనే కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నా ఇప్పుడు కూడా సాధారణ రోజులలో కంటే ఎక్కువుగా నిత్యం 3 నుంచి4 వేల మంది భక్తులు విఐపి బ్రేకు దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకోవడమే అధికార పార్టీ నాయకుల హవా ఎంతలా కోనసాగుతుందో చెప్పడానికి నిదర్శనం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు