• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM GIVE KEY INSTRUCTIONS TO PILGRIMS WHO ARE VISITING TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN

Tirumala Temple: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన.., అలాంటివారు తిరుమలకు రావొద్దని ప్రకటన..

Tirumala Temple: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన.., అలాంటివారు తిరుమలకు రావొద్దని ప్రకటన..

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

ఏపీలో కొవిడ్ (Covid-19) వ్యాప్తి దృష్ట్యా టీటీడీ (TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భక్తులకు పలు సూచనలు చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు పలు ముఖ్యమైన సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనంకు విచ్చేసే భక్తులు తిరుమలలో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఛైర్మన్ టిటిడి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అయ్యారు..అనంతరం టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చేందుతున్న క్రమంలో దర్శన విధివిధానాలపై అధికారులతో చర్చించాంమని, భక్తుల వల్ల టిటిడి సిబ్బందికి కరోనా వ్యాప్తి చేందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించాంమని ఆయన వెల్లడించారు..జిల్లాలో అత్యధిక కేసులు రావడం కొంత ఆందోళన‌ కలిగిస్తోందని,టిటిడి సిబ్బంది అప్రమత్తం ఉండాలని కోరినట్లు తెలిపారు..కరోనా వైరస్ తో టిటిడిలో విధులు నిర్వహించే 15 మంది సిబ్బంది మృతి చేందడం భాధాకరంమని, అన్ని విధాలుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తాంమన్నారు.

    తిరుమల కొండపై కరోనా వ్యాధి వ్యాప్తి లేదని,టిటిడి ఉద్యోగుల క్షేమార్ధం యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాంమని,ఇప్పటి వరకూ 3000 మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసినట్లు వెల్లడించారు.. టిటిడిలో‌ విధులు నిర్వర్తించే సిబ్బంది భధ్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాంమని, కరోనా భారిన పడిన టిటిడి సిబ్బందికి ఆసుపత్రుల్లో కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులకి ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. టిటిడి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా బర్డ్ ఆసుపత్రిని కూడా కోవిడ్ ఆసుపత్రిగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిందని, తిరుమలకు విచ్చేసే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దగ్గు, జ్వరం, జలుబు ఉన్న భక్తులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.

    ఇది చదవండి: ఈ పోలీస్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే...! మరోకరైతే ఇలా చేసేవాళ్లు కాదు


    ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయించాంమని,మొదటి దశలో స్వామి వారికి నైవేద్యం, రెండోవ దశలో అన్నప్రసాదం,మూడోవ దశలో లడ్డూ ప్రసాదం వంటి వాటిలో ప్రకృతి ఆధారిత వస్తువులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. రైతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయించి వారికి అవగాహన కల్పిస్తాంమని, భక్తులు విరాళంగా ఇచ్చిన భూమిల్లో కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

    ఇది చదవండి: శ్రీవారికి ప్రకృతిసిద్ధ నైవేద్యం... ఏళ్లనాటి సాంప్రదాయం మళ్లీ ప్రారంభం


    ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా రోజువారీ దర్శన టోకెన్ల జారీని కుదించింది. ప్రస్తుతం 15వేలకు మించకుండా టోకెన్లు జారీ చేస్తోంది. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
    Published by:Purna Chandra
    First published: