Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM GETTING READY TO CONDUCT VAIBHAVOTSAVALU IN NELLORE DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirumala News: శ్రీవారి వైభవోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆ ఉత్సవాల ప్రాముఖ్యత ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

TTD: హిందూ సంప్రదాయాలను, సంకృతులను వాడవాడలా వ్యాప్తి చేసేలా పలు కార్యక్రమాలను చేపట్టిన టీటీడీ.. వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు సంకల్పించింది. అసలు శ్రీవారి వైభవోత్సవాలు అంటే ఏమిటి..?

    GT Hemanth Kumar, News18, Tirupati

    అనంత కోటి భక్తుల ఆరాధ్య దైవం వెలసిన దివ్య క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple). స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేదుకు దళిత గోవిందం కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. అనంతరం దళితవాడల్లో శ్రీవారి ఆలయాలను నిర్మాణం చేపట్టింది. హిందూ సంప్రదాయాలను, సంకృతులను వాడవాడలా వ్యాప్తి చేసేలా పలు కార్యక్రమాలను చేపట్టిన టీటీడీ.. వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు సంకల్పించింది. అసలు శ్రీవారి వైభవోత్సవాలు అంటే ఏమిటి..? ఆ వైభవోత్సవాల్లో ఏఏ సేవలు నిర్వహిస్తారు..? ఎప్పుడు ప్రారంభించారు. ఆపద మొక్కుల వాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఆపద మొక్కుల వాడైనా., అనాధ రక్షకుని సన్నిధే భక్తులకు ముక్తి మార్గం. భక్తులు తాము కోరుకున్న కోర్కెలు తీర్చే కోనేటి రాయునికి వడ్డికాసుల రూపంలో మొక్కులు సమర్పింస్తారు భక్తులు. ఆనంద స్వరూపునికి వివిధ రూపాలలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు ఉంటాయి.

    స్వామి వారిని సామాన్య భక్తులు సాధారణ సర్వ దర్శనం, దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవ సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఇక నిత్య సేవల్లోను లక్కీ డిప్ ద్వారా సామాన్య భక్తులకు సేవ భాగ్యం ఇస్తున్నా.., అందరి భక్తులకు ఆ భాగ్యం దక్కదు. స్వామి వారి సేవలను చూసి తరించే భాగ్యం కొందరికే సాధ్యం అవుతుంది. భక్తులందరూ స్వామి వారి సేవను తిలకించే విధంగా వాడవాడలా తెలిపే విధంగా, స్వామి వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా 2014లో వైభవోత్సవాలు ప్రారంభించింది టీటీడీ. కరోనా సమయంలో నిలుపుదల చేసిన వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించనుంది టీటీడీ.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిట్టా ఇదే..!


    శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య వారోత్సవాలే వైభవోత్సవం
    శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాతసేవ మొదలుకొని, తోమాల సేవా, అర్చన సేవలను నిర్వహిస్తారు. ఇక సాయంకాల ఆరాధనగా తోమాల సేవా, అర్చన సేవలని నిర్వహిస్తారు. ఇవన్నీ ధ్రువబేరంగా మూలవిరాట్ కు నిత్య కైంకర్యాలుగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం (ఉంజల్ సేవా), అర్జిత బ్రహ్మోత్సవం, అర్జిత వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు ఉత్సవ బేరమైన శ్రీదేవి భూదేవి సామెత శ్రీ మలయప్ప స్వామి వారికీ నిర్వహించడం ఆనవాయితీ.

    ఇది చదవండి: తిరుమలలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇలా చేయండి.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..


    అన్ని సేవలు అయినా అనంతరం స్వామి వారికీ ఏకాంత సేవ నిర్వహిస్తారు అర్చకులు. ఇలా రోజు వారి సేవలు ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇక ఒక్కో వారం ఒక్కో సేవ నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం సడలింపు, నేత్ర దర్శనం ,తిరుప్పావడ, పూలంగిసేవ చేస్తారు. శుక్రవారం ఎంతో విశేషంగా అభిషేఖం., నిజపాద దర్శనం నిర్వహిస్తారు. ఈ సేవలన్నీ స్వామి వైభవోత్సవల్లో నిర్వహించనుంది టీటీడీ.


    ఇది చదవండి: టీటీడీ కొత్త ఐడియా.. భక్తుల కోసం వర్చులవ్ క్యూలెన్.. రెండు గంటల్లోనే దర్శనం.. పూర్తి వివరాలివే..!


    "ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు నిర్వహించనున్నాం. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం సడలింపు,నేత్ర దర్శనం, తిరుప్పావడ,పూలంగిసేవ చేస్తారు. శుక్రవారం ఎంతో విశేషంగా అభిషేఖం., నిజపాద దర్శనంను నమూనా ఆలయంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలి" అని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు