Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM GETS HUGE AMOUNT OF HUNDI INCOME AFTER CORONA SEASON FULL DETAILS HERE PRN

TTD News: వడ్డీకాసులవాడికి కానుకల వర్షం.. రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం..

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

వేసవి సెలవులు శ్రీవారికి బాగా కలిసొచ్చి.. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండి ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. తిరుమల (Tirumala) శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు దాటుతోంది.

    వడ్డీకాసులవాడి పెళ్లి రోజు కుబేరుడు కాసుల వర్షం కురిపించాడంటారు.. అది మనమెవ్వరు చూడకపోయినా.. ఇప్పుడు అలాంటి కాసుల వర్షమే ఆ తిరుమలేశుడిపై కురుస్తోంది. ఒకవైపు కరోనా ఆంక్షలు (Covid Rules) ఎత్తివేయడం.. మరోవైపు వేసవి సెలవులు శ్రీవారికి బాగా కలిసొచ్చి.. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండి ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. తిరుమల (Tirumala) శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు దాటుతోంది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క మే నెలలోనే ఆ బాలాజీ ఖాతాలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చిపడింది. కోవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. దీనివల్ల ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది.

    వేసవిసెలవులు కావడంతో పెరిగిన రద్దీ..ఆదాయం:
    ఒకవైపు కరోనా ఆంక్షలు ఎత్తివేయడం..మరోవైపు వేసవి సెలవులు శ్రీవారికి బాగా కలిసొచ్చాయి. మే నెల వేసవి సెలవులు కావడంతో తిరుమల గిరులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ రెండేళ్లుగా కరోనా కారణంగా స్వామివారిని దర్శించుకోలేని భక్తులు..సెలవులు దొరకడంతో తిరుమలకు క్యూ కట్టారు. దీంతో భక్తుల రద్దీ పెరిగి.. స్వామి వారి దర్శనం 48 గంటల తర్వాత దొరికిన రోజులు మనం చూశాం. ఇలా భక్తుల రద్దీ పెరగడంతో..అలా స్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది.

    ఇది చదవండి: చిక్కను దొరకను.. ముప్పతిప్పలు పెడుతున్న పులి.. ప్రస్తుతం ఎక్కడుందంటే..!


    శ్రీవారి హుండీ లెక్కలు..!
    ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు రాగా, ఏప్రిల్‌ నెలలో రూ.127.5 కోట్లు వచ్చింది. మే నెలలో అయితే టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడైతే జూన్‌ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్‌ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.106 కోట్ల వరకు వచ్చింది.

    ఇది చదవండి: టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన వ్యాపారి ఐడియా..! అందరి చూపు అతనివైపే..!


    ఈ ఏడాది ఆదాయం రూ.1500కోట్లు దాటొచ్చు…!
    ప్రస్తుతం తిరుమలేశుని హుండీ ఆదాయం గతంలో కంటే ఎక్కువగా వస్తోంది. ఇంతకుముందు ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం వచ్చేది. వేసవి సెలవులు ఉండే మే, జూన్‌ నెలల్లో మాత్రం రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం హుండీ ఆదాయం కాస్త తక్కువగానే ఉండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీవారి ఆదాయం దాదాపు రూ.500 కోట్ల మార్కు దాటింది. ఇదే గనుక కంటిన్యూ అయితే శ్రీనివాసుని వార్షికాదాయం రూ.1,500 కోట్లు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు