Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM GAVE CLARITY ON CHATRAPATHI SHIVAJI CONTROVERSY ISSUE NGS TPT

TTD: ఛత్రపతి శివాజీకి అవమానం అంటూ దుష్ప్రచారం.. అదేం లేదంటూ టీటీడీ వివరణ.. ఏం జరిగిందంటే?

ఛత్రపతి శివాజీకి అవమానంపై టీటీడీ వివరణ

ఛత్రపతి శివాజీకి అవమానంపై టీటీడీ వివరణ

TTD Clarity: ఎదో ఒక వివాదానికి కేంద్రంగా మారుతోంది ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్తానం.. తాజాగా ఛత్రపతి శివాజీని టీటీడీ అవమానించింది అంటూ పెను దుమారం రేగింది. అయితే దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..? ఛత్రపతి శివాజీకి అవమానం అంటూ దుష్ప్రచారం... అదేం లేదంటూ స్పష్టం చేసిన టీటీడీ. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    TTD Gave Clarity on Chatrapati Shivaji Issue:  కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala). ఏడుకొండలలో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాసుడి  దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే నిత్యం స్వామి దార్శనికి వచ్చే భక్తులు భక్తి శ్రద్దలతో... స్వామి సన్నిధిలో గోవింద నామ స్మరణ వినిపిస్తారు.  స్వామి వారిని సేవించే తిరుమల చాల సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలలో టీటీడీ చాల జాగ్రత్తలు తీసుకుంటుంది. చిన్న పొరపాటు జరుగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది  టీటీడీ. స్వామి వారి దర్శనార్థం తిరుమలకి వచ్చే భక్తులను తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంవద్ద క్షుణంగా తనిఖీ చేస్తారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఒక్కో వాహనాన్ని 2 నుంచి మూడు నిమిషాల పాటు తనిఖీ చేస్తారు. ఇలా తనిఖీ చేపట్టి అన్యమతస్థుల చిహ్నాలు., పార్టీ చిహ్నాలను తిరుమలకు పూర్తిగా నిషేధించారు. దింతో అన్యమతస్థులు చిహ్నాలు., ఇతర చిహ్నాలు ఉంటె అలిపిరి గెట్ వద్దే తీసిపడేస్తారు.  ఇతర మతాల శ్లోకాలు కలిగిన స్టిక్కర్లను సైతం తీసి పడేస్తారు. కానీ గత కొంత కాలంగా ఛత్రపతి శివాజీకి అవమానం జరిగిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తి స్థాయిలో కందిస్తోంది. అసలేమైంది అంటే..

    మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛ‌త్రపతి శివాజీ మహరాజ్‌ (Chatrapathi Shivaji Maharaj) కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టిటిడి శనివారం ఒక‌ ప్రకటనలో ఖండించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల విగ్ర‌హాలు, ఫొటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు,  చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి తిరుమ‌లకు తీసుకువెళ్ల‌డాన్ని టిటిడి కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.



    ఈ మేర‌కు రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి చెక్‌పాయింట్‌ దగ్గర భ‌ద్ర‌తా సిబ్బంది నిలిపి త‌నిఖీలు చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌ద్ర‌తా సిబ్బంది న‌ల్ల‌టి రంగులో ఉన్న ఒక ప్ర‌తిమ‌ను గుర్తించారు. ఆ ప్ర‌తిమ ఛ‌త్ర‌ప‌తి శివాజీద‌ని తెలుసుకుని తిరుమ‌ల‌కు అనుమ‌తించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్య‌క్తుల విగ్ర‌హాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని స‌ద‌రు భక్తుడిని కోరారు.

    ఇదీ చదవండి : ఆమెకు 35.. ప్రియుడుకి 18.. రెండు నెలలు ఆగలేక అంత పని చేశారా?మురళి మిస్సింగ్ కేసులో ట్వీస్ట్

    దానికి ఆ  భక్తుడు శివాజీ మహారాజ్‌ను టీటీడీ అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలను టిటిడి తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అసత్య ప్రచారాలను.. ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirupati

    తదుపరి వార్తలు