Home /News /andhra-pradesh /

TTD New Decision: టీటీడీ కొత్త నిర్ణయం వర్కవుట్ అవుతుందా..? ఉద్యోగుల రియాక్షన్ ఏంటి..?

TTD New Decision: టీటీడీ కొత్త నిర్ణయం వర్కవుట్ అవుతుందా..? ఉద్యోగుల రియాక్షన్ ఏంటి..?

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశంలోనే అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. స్వామివారి భక్తులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumarn, Tirupathi, News18

  తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశంలోనే అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. స్వామివారి భక్తులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులున్నారు. ఉద్యోగుల విషయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకిరాగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం APCOS పేరుతో కొత్త కార్పొరేషన్ తీసుకొచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు టీటీడీ కూడా అదే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.


  ఇకపై టీటీడీలోకి కొత్తగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోగానీ, ఏజెన్సీలు, ఇతర సంస్థలకు గానీ ఉద్యోగులను నియమించరాదని.., అలాగే గడువు ముగిసిన కాంట్రాక్టులను కూడా పొడిగించరాదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆప్కాస్ తరహాలో టీటీడీలో ఓ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు దృష్టి సారించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా ఉద్యోగుల్లో అభద్రతా భావం పోతుందని అధికారుల ఆలోచన.

  ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!


  గతంలో చోటు చేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలు మారినప్పుడల్లా ఉద్యోగుల్లో కొంత అభద్రతా నెలకొంటుండేది. అప్పటికే ఉన్నవాళ్లను కాదనీ కొత్తవారిని నియమించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సమయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేసే ఉద్యోగులు సైతం ధర్నాకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేక సొసైటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!


  కొన్నేళ్లుగా టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పే స్కేల్ కల్పిస్తామని గత పాలక మండళ్లు హామీలిచ్చాయి. స్థానిక నాయకులూ కూడా అదే తరహా హామీలు ఇస్తూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ బోర్డు దీనిపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ, దాని అధ్యయనం ఎటుపోయిందో తెలియదు కానీ టీటీడీ రూట్ మార్చింది. ఆప్కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటై తమ సర్వీసును దాని పరిధిలోకి చేరిస్తే పే స్కేల్ వంటి కోరికలు నెరవేరడం అసాధ్యమని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆలోచిస్తున్నారట.

  ఇది చదవండి: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?


  ఐతే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ నిర్ణయం టీటీడీలో కలకలం రేపుతోంది. దీనిపై ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. టీటీడీ ఈవో తాజా ఉత్తర్వులతో ఇపుడు మరిన్ని సొసైటీలు, ఏజెన్సీలు, వ్యక్తిగతంగా ఉద్యోగులు కూడా కోర్టుకు వెళ్ళేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజకీయంగా కూడా ఈ పరిణామం తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా పరిణమించనుంది.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు