Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTANM NEWS TO DAY ON WARDS START PAVITHROTSAVALU AT TIRUMALA NGS TPT

Tirumala: నేటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు..? ప్రత్యేకత ఏంటి? ఎందుకు నిర్వహిస్తారు..?

తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే అంకురార్పణ చేశారు.. అయితే ఈ పవిత్రోత్సవాలు ఎలా నిర్వహిస్తారు.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India
    Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల గిరిలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా భావించే భక్తులు.. భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నెలలో చాలా వరకు పవిత్ర దినాలే ఉండడంతో రద్దీ పెరుగుతోంది. మరోవైపు నేటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.


    అఖిలాండ కోటి బ్రహాండ నాయకుడు తిరుమల శ్రీవారిని ఈ
    శ్రావణ మాసంలో దర్శించుకుంటే మరింత ప్రభావం ఉంటుందన్నది కొందరి భక్తుల నమ్మకం.. ఇదే సమయంలో తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతుండడంతో తమ తప్పులను క్షమించాలని స్వామి వారిని కోరుతూ భక్తులు పోటెత్తుతున్నారు.


    ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం లో కొన్ని తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ దోషాలు తొలిగిపోవాలని కోరుతూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా ఏటా శ్రావణమాసంలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు.


    నేటి నుంచ మూడు రోజుల పాటు.. అంటే 10వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆదివారమే ఈ పవిత్రోతవాలకు సంబంధించి అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు.


    సాధారణంగా రోజూ శ్రీవారికి జరిగే పూజా, సేవా కైంకర్యాలలో ఎన్నో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులు తెలిసినా కొందరు.. తెలియక మరికొందరు పురుడు. మరణం, బహిస్టు సమయాల్లో అలయ ప్రేవేశం చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.


    పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వెళ్లి అంకురార్పన చేశారు. తరువాత అర్చకులు పుట్టమన్నును ఊరేగింపుగా శ్రీవారి అలయానికి తీసుకెళ్ళి, పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపించారు.


    మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దశమినాడు ప్రారంభమై, ద్వాదశినాడు ముగుస్తుంది. ఆగమశాస్త్రోక్దంగా జరిగే ఈ పవిత్రోత్సవాలలో ఉత్సవమూర్తిల కవచాలను తోలగించి శుభ్రపరిచి ఉత్సవమూర్తిలకు ఎదైనా అరుగుదలవున్నట్లు అయితే వాటికి చందనపు ముద్దలతో సరిచేసి తిరిగి కవచాలను తోడిగి ప్రత్యేక పూజలు చేస్తారు.


    స్వామివారి అబిషేకంతో ప్రారంభమయ్యి, హొమం, పవిత్రాల ఆవాహనం, మూడవరొజున సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో 1464 నుండి ఐదురోజులపాటు జరిగేవి, అయితే 1963 నుంచి ఈ ఉత్సవాలను 3 రోజులకు తగ్గించారు. అప్పటి నుండి నేటివరకు ప్రతి ఏటా శ్రావణమాసంలో టీటీడి సంప్రదాయ బద్దంగా ఈ కైకర్యాన్ని నిర్వహిస్తోంది.


    ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు