T Hemanth Kumar, Tirupathi, News18.
Tirumala Tirupati Devastanam: కలియుగ వైకుంఠం... హింధువుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) కొలువైన దివ్యధామం తిరుమల (Tirumala) పుణ్య క్షేత్రం. అందుకే నిత్యం శ్రీవారి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతుంది. ముడుపులుగా శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే నగదు కార్పస్ ఫండ్ రూపంలో టీటీడీ (TTD) డిపాజిట్ చేస్తూ వస్తోంది. హుండీలో భక్తులు సమర్పించే బంగారం సైతం టీటీడీ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్స్ చేస్తుంది. శ్రీవారి దర్శనాలకు వచ్చే బడా పారిశ్రామికవేత్తలు, ఇతరులు విరాళాల రూపంలో టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లకు విరాళం అందిస్తుంటారు. ఇలా 10 వేల రూపాయల నుంచి శ్రీవారికి విరాళం ఇచ్చే భక్తులకు ప్రివిలేజ్ కింద దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఇలా 10 వేల నుంచి కోట్ల రూపాయల వరకు విరాళం అందిస్తారు భక్తులు. వారు విరాళం ఇచ్చిన నగదు ట్రస్ట్ నిర్వహణకు వినియోగిస్తారు.
శ్రీవారికి ముడుపుల రూపంలో భక్తులు హుండీలో చెల్లించే నగదు ద్వారానే టీటీడీకి ఏడాదిలో 700 నుంచి 1000 కొట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఇలా వచ్చే నగదును కార్పస్ ఫండ్ గా జాతీయ బ్యాంకుల్లో చెల్లిస్తుంది టీటీడీ. నగదుతో పాటు గోల్డ్ డిపాజిట్స్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి.. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి టీటీడీ ఆదుకుంటోందని సోషియల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈవో ధర్మారెడ్డి పాలకమండలి సభ్యులతో కలసి ప్రభుత్వానికి కార్పస్ ఫండ్ ని దారాదత్తం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్స్ రూపం ఇచ్చే ప్రక్రియ కొత్తదేం కాదు. కానీ 1987వ సంవత్సరంలో సెక్షన్ 111(3) ఎండోమెంట్ యాక్ట్ 30, 1990 గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం టీటీడీ రూల్ నంబర్ 80లో సెక్యూరిటీ డిపాజిట్లు ప్రభుత్వ నియమాలు అనుసారం ప్రభుత్వ అనుమతితో చేయవచ్చన్న స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి : ఇడుపులపాయలో హైవే వేస్తారా..? పిచ్చికూతలు అంటూ పవన్ పై మంత్రి ఫైర్
దీనిని అనుసరించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేవలం సాధ్యాసాధ్యాలపై ఓ కమిటీ వేసి పరిశీలన చేయాలనీ మాత్రమే ఆదేశాలు జారీ చేసారు. నాటి నుంచి నేటి వరకు దీనిపై సోషల్ మీడియాలో డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో ప్రచారం సాగుతోంది. దింతో ఆవేదన చెందిన ఓ భక్తుడు ఇవాళ ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డిని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : భర్తను దొంగలు హత్య చేసారని భార్య ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాంక్
దీనిపై స్పందించిన ఈవో ఏవి ధర్మారెడ్డి.. సోషయల్ మీడియాలో టీటీడీపై విషప్రచారం తగదని హెచ్చరించారు. టీటీడీపై బురద చల్లడానికే డిపాజిట్లపై సోషల్ మీడియాలో వందంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఐదు వేల కోట్ల డిపాజిట్లను స్టేట్ గవర్నమెంట్ కు బాండ్ల రూపంలో ఇచ్చారనేది ముమ్మాటికీ అవాస్తవమని స్పష్టం చేసారు. నేషనలైజ్డ్ బ్యాంకులలోనే నగదు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి : ఇడుపులపాయలో హైవే వేస్తాం.. ఇప్పటంలో పవన్ సంచలన వ్యాఖ్యలు
ఇలాంటి వందంతులు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేసారు. డిపాజిట్లపై శ్వేతా పత్రం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఎస్ఎస్డి టైం స్లాట్ ఆన్లైన్ లో విడుదల చేయాలనీ భక్తులు కోరుతున్నారని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు ఎస్ఎస్డి టైం స్లాట్ కోరుకుంటే మెల్లగా టిక్కెట్ల సంఖ్యా పెంచుతామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam