హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: టీటీడీలో కొలువు కావాలా..? చేయి తడిపితే చాలు అంటున్న ఉద్యోగి.. రేటు ఎంతంటే?

Tirumala: టీటీడీలో కొలువు కావాలా..? చేయి తడిపితే చాలు అంటున్న ఉద్యోగి.. రేటు ఎంతంటే?

తిరుమలలో ఉద్యోగాల పేరుతో టోకరా..?

తిరుమలలో ఉద్యోగాల పేరుతో టోకరా..?

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలలో జాబ్ కావాలా.. అయితే మా చెయ్యి తడపండి అంటున్నారు కొందరు.. ఒక జాబ్ కోసం వారు ఎంత వసూలు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..

 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  GT Hemanth Kumar, Tirupathi, News18

  Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) కొలువైన తిరుమల (Tirumala)లో..  టీటీడీ (TTD) దేవస్థానం ఉద్యోగం చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలని నానుడి ఉంది.  అయితే శ్రీనివాసుడి సన్నిధిలో ఉద్యోగం సంపాదించాలంటే అంతా సులువుగా సాధ్యం కాదు. అయితే డోంట్ వర్రీ అంటున్నాడు. తన చేయి తడిపితే చాలు.. ఎలాంటి ఉద్యోగం కావాలన్ని కొన్ని రోజుల్లోనే ఇప్పిస్తాను అంటూ ఓ ఉద్యోగి (Employee) పలువురి దగ్గర నగదు వసూలు చేశారు. అయితే అతడు తాను టిటిడిలో ఉద్యోగిని అంటూ కలరింగ్ ఇస్తూ వచ్చాడు. అందుకే  తానూ చెబితే ఇట్టే టీటీడీలో ఉద్యోగం ఇస్తారంటూ మాయ మాటలు చెప్పాడు. నకిలీ గుర్తింపు కార్డుతో (Fake TTD Identity Card)  ప్రతి రోజు తిరుమలకు వచ్చే నిరుద్యోగ యువతి గురించి ఆరా తీసి.. వారిని బుట్టలో వేసుకునే వాడు.

  స్థానికులు.. టీటీడీ విజులెన్స్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని కొరమేనుగుంటకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి తానొక టిటిడి ఉద్యోగిని అంటూ అందరిని నమ్మించాడు. అదే నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని పన్నాగం పన్నాడు. జల్సాలకు అలవాటు పడిన బాలకృష్ణ ఎలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని.. అక్కడ పరిచయమైన కొందరితో కలిసి పథకం రచించాడు.

  పక్కా ప్లాన్ తో తాను టీటీడీలో ఓ కీలక పోస్టులో్ ఉన్నాను అని చెప్పి చుట్టు ప్రక్కల వారిని, తెలిసిన వారిని నమ్మించాడు.. అంతే కాకుండా టిటిడిలో ఉద్యోగాలు ఇప్పించే హోదాలో తాను ఉన్నానంటూ నిరుద్యోగ యువతను టార్గెట్ గా చేసుకుని వల పన్నాడు.. టీటీడీ  వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను చెబితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని నిరుద్యోగ యువతకు మాయ మాటలు చెప్పాడు.

  ఇదీ చదవండి : కొడాలి వర్సెస్ దగ్గుబాటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కారణం అదే..?

  అయితే తిరుమలలో ఉద్యోగం రావాలి అంటే.. అంత ఈజీ కాదని.. అది తన వల్లే సాధ్యం అవుతుందని నమ్మించాడు. దానికిగాను కొంత మొత్తంలో నగదు ఇవ్వాలని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుండి లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఉద్యోగం కోసం కొంత కాలం పాటు వెయిట్ చేయాలని చెప్పి ఏళ్ళ తరబడి కాలం గడుపుతూ వచ్చేవాడు. గట్టిగా ప్రశ్నించిన వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసేవాడు.. నకిలీ ఉద్యోగ ధృవపత్రాలు పొందిన కొందరు యువకులు టీటీడీ అధికారులను కలిసి తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పడంతో బాలకృష్ణ మోసం గుట్టు రట్టు అయ్యింది.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?

  టీటీడీ అధికారులు ఇచ్చిన షాక్ తో.. తామంతా మోసపోయామని తెలుసుకున్న యువకులు నేరుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీనిపై కేసు నమోదు చేసిన బాలకృష్ణను చాకచక్యంగా నకిలీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించారు.. కొందరు నిరుద్యోగ యువత వద్ద నుండి దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు నగదు తీసుకుని మోసగించినట్లు టిటిడి విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది.

  ఇదీ చదవండి: దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

   బాలకృష్ణ దగ్గర నుండి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, రబ్బరు స్టాంపులు, టిటిడి అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు, నకిలీ ఎంపీ కారు స్టిక్కర్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందుతుడు బాలకృష్ణతో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరి కొందరి కోసం టిటిడి విజిలెన్స్ అధికారులు గాలిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు