హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చాప, తాడు కీలకం.. ఎక్కడ నుంచి తెచ్చారో తెలుసా..?

Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చాప, తాడు కీలకం.. ఎక్కడ నుంచి తెచ్చారో తెలుసా..?

బ్రాహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

బ్రాహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ధ్వజారోహణానికి దర్ప చాప, తాడు కీలకం.. వాటిని ఏం చేస్తారు.. ఎక్కడ నుంచి తెచ్చారో తెలుసా..? మరోవైపు కేవలం రెండు రోజులే ఉండడంతో.. ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  Tirumala: కలియుగదైవం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును తిరుమలకు తీసుకొచ్చింది. ప్రత్యేకించి టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎఫ్‌వో ఎ.శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. 

  శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 27వ తేదీన జరిగే ధ్వజారోహణంలో ఈ తాడు, చాపను ఉపయోగిస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం అవుతాయి.

  బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు.

  అయితే వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేసింది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు.

  ముందుగా వీటిని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరుస్తారు. ఆ రువాతే వాటితో చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేశారు. 

  మరోవైపు శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండ‌డంతో విభాగాల వారీగా చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జ‌రిగింది. జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

  రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భ‌క్తుల స‌మ‌క్షంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

  పరకామణి భ‌వ‌నం త‌నిఖీ

  సెప్టెంబరు 28న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టన సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd news

  ఉత్తమ కథలు