Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATI DEASTHNAM WILL RELEASED FREE TICKETS FOR OLD MAN TOMORROW ON WARDS NGS TPT

Tirumala: భక్తులకు టీడీడీ మరో శుభవార్త.. వారికి రేపు ఆన్‌లైన్‌లో ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుదల

భక్తులకు టీటీడీ మరో శుభవార్త

భక్తులకు టీటీడీ మరో శుభవార్త

Tirumala: కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది.. రేపటి నుంచి వారి కోసం ప్రత్యేకంగా ఉచిత దర్శన కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఆగస్టు 8 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు టీడీడీ సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...
    Tirumala: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల (Tirumala) లో వెలసిన వెంకన్నస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వర్షాలలను సైతం లెక్క చేయడం లేదు.. స్కూళ్లు ప్రారంభమైన తరువాత రద్దీ తగ్గడం లేదు. నిత్యం భారీగానే భక్తులు వస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ లో టోకెన్ల (Online Tokens)కు అదే స్థాయిలో డిమాండ్ కనిపిస్తోంది. గంటల వ్యవధిలోనే టికెట్లు అయిపోతున్నాయి. అయితే ఇలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనం వారికి ఇబ్బందిగా మారుతోంది. అందుకే అలాంటి వారికి కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా ఆన్ లైన్ లో టోకెన్లు విడుదల చేయాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను.. రేపు అంటే శనివారం విడుదల చేస్తోంది టీటీడీ. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున వీటిని జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

    మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు క్యూ కట్టారు. వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. ఇక రేపు ఎల్లుండి వీకెండ్ కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. అలాగే నిత్యం హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో స్వామి వారికి వస్తోంది.



    భక్తుల సంఖ్య ఎంత పెరిగినా వారికి తగిన సౌకర్యాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పవిత్రోఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి : ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా..? అధికార పార్టీ నేత అయినా.. వ్యవసాయంతో బిజీ బిజీ

    ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 7న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 9న అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌తోపాటు ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala tirupati devasthanam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు