Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA TIRUPATHI DEVASTHANAM THINKING OFF TO INTRODUCE NEW SYSTEM FOR BREAK DARSHAN FOR PILGRIMS FULL DETAILS HERE PRN TPT

Tirumala Darshan: శ్రీవారి దర్శనానికి కొత్త విధానం.. టీటీడీ ఆలోచన వర్కవుట్ అవుతుందా..?

Corona Effect On Tirumal: ఆంధ్రప్రదేశ్ పై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. సుమారు రెండు నెలల తరువాత రోజు వారీ కేసుల సంఖ్య వేయి దాటుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని.. వివాహాలు, పంక్షన్లపైనే ఆంక్షలు పెట్టింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంపైనా కరోనా ప్రభావం పడింది.

Corona Effect On Tirumal: ఆంధ్రప్రదేశ్ పై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. సుమారు రెండు నెలల తరువాత రోజు వారీ కేసుల సంఖ్య వేయి దాటుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని.. వివాహాలు, పంక్షన్లపైనే ఆంక్షలు పెట్టింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంపైనా కరోనా ప్రభావం పడింది.

కలియుగ వైకుంఠంలో కొలువై ఉన్న తిరుమల (Tirumala Temple) శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు. ఒక్కసారైనా స్వామి వారిని దర్శించుకోవడం వల్ల చేసిన పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    కలియుగ వైకుంఠంలో కొలువై ఉన్న తిరుమల (Tirumala Temple) శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు. ఒక్కసారైనా స్వామి వారిని దర్శించుకోవడం వల్ల చేసిన పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిత్యం వేలాది మంది స్వామిని దర్శించుకొని తరిస్తుంటారు. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సామాన్య భక్తులకు టీటీడీ సర్వదర్శనం (TTD Online Tokens), ఆన్లైన్ లో విడుదల చేసే వివిధ రకాల సేవలు, విఐపి సిపార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, వివిధ రకాల ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్ట్ ద్వారా వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం ద్వారా భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకుంటారు.

    శ్రీవారి మహా లఘు దర్శనం కాకూండా.., స్వామి వారిని అత్యంత దగ్గరగా కులశేఖర పడి (శ్రీవారి గర్భాలయానికి మొదటి గడప) వద్ద నుంచి దర్శించుకోవాలని కోరుకుంటారు. అలాంటి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామంటూ కొందరు దళారులు భక్తులను ఆశ్రయిస్తుంటారు. నిజానికి రూ.500 ఉన్న ఒక్కో బ్రేక్ దర్శన టిక్కెట్లని డిమాండ్ ను బట్టి అధిక మొత్తానికి అమ్మేస్తూ సొమ్ముచేసుకుంటుంటారు.

    ఇది చదవండి: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?


    ప్రోటోకాల్ పరిధిలోని బ్రేక్ దర్శనాలు అయితే... రూ.10 నుంచి రూ.15 వేలు వసూలు చేసేవారు దళారులు. ఇక సామాన్య బ్రేక్ దర్శనంఅయితే ఒక్కో టికెట్ కు 3 నుంచి 5 వేల రూపాయల చొప్పున బేరం ఆడే వారు. ఇంకా డిమాండ్ పెరుగుతూ పోతే మరింత రేటును పెంచేస్తుంటారు. అలా వసూలు చేసిన డబ్బుతో దర్శనం కల్పించకుండా పరాయి అయిన భక్తులు ఉన్నారు. దళారుల నుంచి మోసపోకుండా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి.., ట్రస్టుకు 10వేల రూపాయలు డొనేషన్ ఇచ్చిన దాతకు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. దీంతో భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది.

    ఇది చదవండి: అర్ధరాత్రి వింత శబ్దాలు.. లేచి చూస్తే అమ్మవారు ప్రత్యక్షం... పరుగులు పెడుతున్న జనం.. ఎక్కడంటే..!


    శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దళారులకు చెక్ పెట్టాలని చూసిన టీటీడీ 70% శాతం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. కానీ మరో 30 శాతం మంది భక్తులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ కు అందించే విరాళంతో మరో ఇద్దరు దర్శనానికి వెళ్లొచ్చని భావించే భక్తులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొందరు విజిలెన్స్ సిబ్బందికి చిక్కిపోతుంటే... మరి కొందరు దర్శనం అనంతరం మేము మోసపోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అసలే కరోనా కాలం ఆపై.... పరిమిత సంఖ్యలో దర్శనాలు కావడంతో మరింత డిమాండ్ నెలకొంది.

    ఇది చదవండి: మరో వివాదంలో టీటీడీ.. ఉదయాస్తమాన సేవా టికెట్లపై కాంట్రవర్సీ..


    ఇప్పటికే దళారులు బ్రేక్ దర్శన టిక్కెట్లతో పాటుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు బ్లాక్ లోవిక్రయిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ఒక్కో టికెట్ వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు దళారులకు అదనంగా చెల్లిస్తున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో దళారులను పూర్తిగా తిరుమల నుంచి ఏరివేసేందుకు టీటీడీ అధికారులు నయా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మధ్యతరగతి భక్తులు సైతం శ్రీవారి బ్రేక్ దర్శనం చేసుకొనేలా.. టీటీడీ ఉన్నతాధికారుల టేబుల్ పై ప్రొపోజల్ ఉన్నట్లు సమాచారం.

    ఇది చదవండి: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?


    మినీ శ్రీవాణిని ప్రవేశ పెడితే బాగుంటుందని కొందరి అభిప్రాయం. దళారులకు అప్పజెప్పే సొమ్మును శ్రీవారికి అందించడం ద్వారా పాడైలోయినా ఆలయాల నిర్వహణ., పునరుద్దరణకు వినియోగించవచ్చని టీటీడీ యోచిస్తోంది. మినీ శ్రీవాణి ట్రస్ట్ అందించాల్సిన విరాళం ధర రూ. 2500 నుంచి రూ.4 వేల వరకు ఉండే అవకాశం ఉంది. గత ఏడాదిగా ఆ ఫైల్ టేబుళ్లకే పరిమితం కావడం విశేషం. ఉన్నతాధికారుల సమావేశాల్లో మినీ శ్రీవాణి ట్రస్ట్ ప్రస్తావన రావడం.., మళ్లీ ఫైల్ అడుగున పడిపోవడం సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇక పాలక మండలిసమావేశంలోనూ ఈ అజెండాలో చేర్చలేదు.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


    మినీ శ్రీవాణి ఫైల్ ముందుకు పోక పావడానికో అనేక కారణాలు ఉన్నాయి. ఒకవేళ మినీ శ్రీవాణి ట్రస్ట్ తెరపైకి తీసుకొస్తే.., మళ్లీ వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సంస్థను ధనార్జన సంస్థగా మార్చేస్తున్నారన్న విమర్శలు టీటీడీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వివిధ హిందూ సంఘాలు, పార్టీల నుంచి వ్యతిరేకత వెలువడే అవకాశం ఉండటంతో మినీ శ్రీవాణి మరుగున పడిపోయే అవకాశం ఉంది. మధ్య తరగతి ప్రజలు కొనగలిగే స్థాయిలో టిక్కెట్లు ఉంటే, శ్రీవారిని ప్రతి ఒక్కరు దగ్గర చూసే భాగ్యం దక్కినట్లే.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు