Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA SRI VARI HUNDI GETS HUGE INCOME IN THE MONTH OF JULY CHECK THE DETAILS HERE PRN TPT

Tirumala: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. జూలై నెలలో ఎంతొచ్చిందంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం వేలాది మంది ఆ సప్తగిరీశుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం వేలాది మంది ఆ సప్తగిరీశుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు. కోర్కెలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కుల చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తుంటారు. అంతేకాకుండా స్వామివారికి కోట్ల విలువైన భూములు కూడా సమర్పించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశ నలువైపులా నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో వారి వారి స్థోమత తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తుల సమర్పించిన కానుకలను అత్యంత భధ్రత నడుమ వాటిని లెక్కించి భధ్రత పరుస్తుంది టీటీడీ (TTD).

    ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనాలు నిలిచిపోయాయి. 83 రోజుల పాటు ఎలాంటి దర్శనాలకు అనుమతించలేదు. దీంతో స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ ఏకాంతంగానే నిర్వహించింది టీటీడీ. కరోనా అదుపులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తూ వచ్చింది టీటీడీ. భక్తుల సంఖ్య తగ్గడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా అంచనాలు తప్పింది.

    ఇది చదవండి: ఏపీలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇక ఈజీ.. ప్రభుత్వం కొత్త ఆలోచన.. త్వరలోనే అందుబాటులోకి


    ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇక జూలై నెలలో శ్రీవారి హుండీ రికార్డుస్థాయిలో నిండింది. మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్ లో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ లో రూ.123.76 కోట్ల ఆదాయం రాగా.. జూలై నెలలో రూ.139.45 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నాలుగు నెలల్లో కలిపి మొత్తం రూ.649.21 కోట్ల ఆదాయం వచ్చింది. వరుసగా ఐదు నెలలు శ్రీవారి ఆదయం రూ.100 కోట్ల మార్క్ దాటింది. జూలై నెలల్లో ఐదు సార్లు రోజువారీ హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటింది. జూలై 4వ తేదీన ఒక్క రోజే ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.

    ఇది చదవండి: ఈ తేదీల్లో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ శుభవార్త మీ కోసమే..!


    శ్రీవారి ఆదాయం రికార్డులను చూస్తే.. 1954 జూన్ నెలలో స్వామివారి ఆదాయం అప్పటికి రికార్డుస్థాయిలో రూ.5,35,703 వచ్చిది. 2015-2016లో ఏకంగా రూ.1010 కోట్ల ఆదాయం వచ్చింది.. కరోనా వ్యాప్తికి ముందు భాగానే ఉన్న ఆదాయం ఆ తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు