Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUMALA NEWS LOOKING SUPER LORD VENKATESWARA SWAMY ART WITH SALT IN ANDHRA PRADESH NGS TPT

Tirumala: బ్రహోత్సవాల కోసం సర్వం సిద్ధం.. ఉప్పుతో గోవిందుడి బొమ్మ గీసిన భక్తుడు.. చూస్తే వావ్ అనాల్సిందే

బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Tirumala: రెండున్నరేళ్ల విరామం తరువాత ఈ సారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు ఓ భక్డుడు ఉప్పుతో గీసిన బొమ్మకు రంగులు అద్ది.. గోవిందుడి రూపం తెచ్చాడు.. ఆ ప్రతిమను చూసిన వారెవరైనా వావ్ అనాల్సిందే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India
  Tirumala:అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ శ్రీనివాసుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది.. కరోనా కారణంగా గత రెండేళ్లూ ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam). ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కేవలం సర్వదర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ చరిత్రంలో తొలిసారి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

  ఓ వైపు బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంటూ.. భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిని చూపించుకుంటున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ భక్తుడు.. ఉప్పతో బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ.. పలువురి మన్ననలు పొందుతున్నాడు.

  బ్రహ్మోత్సవాల షెడ్యూల్: సెప్టెంబ‌రు 26న‌ అంకురార్ప.. సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహ‌ణం. సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ‌. అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.  మరోవైపు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సూచించారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. మరోవైపు క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు ధ్వజారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌నసేవ.. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహించనున్నారు.

  ఇదీ చదవండి : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు.. ఎందుకు చేస్తారంటే..? భక్తుల నమ్మకం ఇదే

  పెర‌టాసి మాసం.. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 ల‌క్షల లడ్డూలు పంపిణీ కి ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేశారు. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేశారు. తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్టర్లు, ప్రథ‌మ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు