Tirumala: శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటన.. ఎప్పుడంటే..?

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

VIP break darshan cancel: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్టు ప్రకటించింది. అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశామని.. అలాగే అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది.

  • Share this:
    VIP break darshan cancel: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల (brahmotsavam) సందడి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు (VIP break darshan cancel) చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌ 6 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని టీటీడీ తెలిపింది. అలాగే అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా (Corona) పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. నాదనీరాజనం వేదికపై టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

    బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఈవో అధికారుల‌ను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్ర‌హ్మోత్స‌వాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని అన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్త‌యిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు.

    ఇదీ చదవండి: ఆక్వా రైతులకు అండ.. హెరిటేజ్ కోసం సహకార సంస్థలను నాశనం చేశారన్న సీఎం జగన్

    బ్రహ్మోత్సవాల విశేషాలు
    బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
    06.10.2021 - బుధ‌వారం - అంకురార్ప‌ణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు..
    07.10.2021 - గురువారం - ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) - సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వ‌ర‌కు.
    08.10.2021 - శుక్ర‌వారం - చిన్న‌శేష వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10వ‌ర‌కు.. హంస వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
    09.10.2021 - శ‌నివారం - సింహ వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3గంటల వ‌ర‌కు.. ముత్యపుపందిరి వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
    10.10.2021 - ఆదివారం - క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
    11.10.2021 - సోమ‌వారం - మోహినీ అవ‌తారం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. గ‌రుడ‌సేవ‌ - రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు..
    12.10.2021 - మంగ‌ళ‌వారం - హ‌నుమంత వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్వ‌ర్ణ‌ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం - సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.. గ‌జ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
    13.10.2021 - బుధ‌వారం - సూర్య‌ప్ర‌భ వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న తిరుమంజ‌నం - మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. చంద్ర‌ప్ర‌భ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
    14.10.2021 - గురువారం - ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7.35గంట‌ల‌కు... అశ్వ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు..
    15.10.2021 - శుక్ర‌వారం - ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం - ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం - ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).. ధ్వ‌జావ‌రోహ‌ణం - రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు..
    Published by:Nagesh Paina
    First published: