హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Brahmotsavalu: ముల్లోకాలు చూడాలంటే.. తిరుమలలో కల్యాణ వేదికకు వెళ్లసిందే..! ప్రత్యేకత ఏంటంటే?

Brahmotsavalu: ముల్లోకాలు చూడాలంటే.. తిరుమలలో కల్యాణ వేదికకు వెళ్లసిందే..! ప్రత్యేకత ఏంటంటే?

కళ్యాణం ఒక్కసారి తిలకిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం

కళ్యాణం ఒక్కసారి తిలకిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం

 • News18 Telugu
 • Last Updated :
 • Tirumalaigiri, India

  Tirumala Brahmotsavam:  బ్రహ్మ దేవుడే జరిపే వైభవోత్సవమే బ్రహ్మోత్సవం (Brahmotsavam).. ముల్లోకాలు ఇలవైకుంఠంలో కొలువుదీరే అరుదైన రోజులు. అందుకే టీటీడీ (TTD).. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దేదీప్యమానంగా వెలిగే శ్రీవారి వివిధ రూపాలతో పాటుగా.. హైదవ సంప్రదాయం చిన్నారులకు సైతం అర్థం అయ్యేలా కళ ప్రదర్శనలు చేస్తుంది. ముల్లోలకాలంటే మనం వినడమే తప్ప చూడటం మాత్రం జరగదు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముల్లోకాలను భక్తులకు చూపిస్తోంది టీటీడీ. మూడులోకాలతో పాటుగా శ్రీవారికి నిత్యం వినియోగించే వివిధ రకాల పుష్పాలను (Flower Decoration).. సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ. ముల్లోకాలు చూడాలంటే కచ్చితంగా తిరుమలలోని కల్యాణ వేదికకు వెళ్లసిందే..

  శ్రీవారి బ్రహ్మోత్సవాలు... భక్తులకు ఆధ్యాత్మిక పండుగ మహోత్సవాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోటీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో దివ్యంగా సుందరంగకల్యాణ వేదికను సిద్ధం చేసారు. శ్రీవారికి వినియోగించే 12 రకాలపుష్పలతో  అలంకరించారు.  వివిధ వర్ణాలు కలిగిన పుష్పలతో ఏనుగులు., ఎద్దుల ఆకృతులను ఏర్పాటు చేసారు.

  మైసూరుకు చెందిన క‌ళాకారిణి ఎంఎన్‌.గౌరి రూపొందించిన శ్రీ‌కృష్ణుని విశ్వ‌రూప ద‌ర్శ‌నం సైక‌త శిల్పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ‌నిలుస్తోంది. పురాణాలూ మన భారత జాతికి పట్టుకొమ్మలు లాంటివి. కృత యుగం., త్రేతా యుగం, ద్వాపర యుగంకు చెందిన కళాకృతులు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

  ఇదీ చదవండి : ఆడపిల్లలకు గుడ్ న్యూస్.. వారికి 1.50 లక్షలు.. ఆ 2 పథకాలు రేపటి నుంచే అమలు.. అర్హత ఏంటంటే?

  ముల్లోకాలు చూడాలంటే మనకు సాధ్యం అయ్యే పని కాదు. సినిమా విజువల్స్ గ్రాఫిక్స్ లో మాత్రమే నామం ముల్లోకాలను చూసాము. మరి ముల్లోకాలు ఎలా ఉంటాయో టీటీడీ మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ముల్లోక మార్గంలోకి వెళితే ముందుగా సరస్వతి సామెత బ్రహ్మ దేవుడు కొలువైన బ్రహ్మలోకం మనకు దర్శనం ఇస్తుంది.

  ఇదీ చదవండి : ఉన్నత విద్యకు డబ్బులు లేవని భయపడుతున్నారా..? ఈ రోజే ఆఖరి రోజు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

  సరస్వతి దేవి వీణ గానంలో మనుషుల తలరాతలు రాసె బ్రహ్మ దేవుడిని చూసి ధరించాల్సిందే. పాల కడలిపై శేషసేయనుడైన శ్రీవారిని చూడాలంటే ఎన్ని జన్మలు ఎత్తిన సరిపోదు. వైకుంఠంలో లక్ష్మి సామెత శ్రీ మహా విష్ణువు దర్శనం పూర్వజన్మ సుకృతం. ఇక కైలాసనాధుని దర్శనం ముక్తి మార్గంగా ఏర్పాటు చేసారు.

  ఇదీ చదవండి: సరస్వతీ దేవికి పవన్ ప్రత్యేక పూజలు.. అక్టోబర్ నుంచి కీలక నిర్ణయాలు ఏంటంటే..?

  యుగాలకు ప్రతీకగా వివిధ కళాకృతులను కల్యాణ వేదికలో ఏర్పాటు చేసారు. ఘటోత్కచుని యుద్ధ వైభవం., గోపికలను నదిలో ఆట పట్టిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు., బలిచక్ర వత్తిని పాతాళానికి తొక్కిన వామనుడు., మూర్ఛపోయి పడిపోయిన అర్జుని కోసం సంజీవని తెచ్చిన హనుమ., తల్లి భూదేవి ఒడిలోకి వెళ్తున్న సీత దేవి., గుహుడితో పడవలో ప్రయాణం చేస్తున్న సీత లక్ష్మణ సామెత శ్రీ రాముడు., యశోద వద్ద చిలిపి చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుడు., వకుళ వద్ద తలకి అయ్యిన గాయానికి కట్టు కట్టుకుంటున్న శ్రీ వేంకటేశ్వరుడి ప్రతిమలు భక్తులని ఆకట్టుకుంటున్నాయి.

  ఇదీ చదవండి : అమ్మకు ప్రేమతో.. ఆమె కోరికపై మోడల్ గా మారిన మిడిల్ క్లాస్ యువతి.. సక్సెస్ స్టోరీ ఇదే

  "కల్యాణ వేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటు చేసాం.శ్రీవారి వైభవాన్ని తెలిపే విధంగా 12రకాలపుష్పలు., 6 రకాల కట్ ఫ్లవర్స్ ప్రదర్శనకి ఉంచారు. ఇవన్నీ నిత్యం స్వామి వారి కైంకర్యాలలో వినియోగించేవే.. ఇక ముల్లోకాలు చూసే విధంగా అద్భుతమైన సెట్ వేశారు. కృత, త్రేతా, ద్వాపర యుగాల సారాంశం తెలిపే విధంగా ప్రతిమలు ఏర్పాటు చేసాము. ఇవన్నీ దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని " న్యూస్18తో ఉద్యానవన శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు