(G.T.Hemanth Kumar,News18,Tirupathi)
మధ్య తరగతి కుటుంబీకులు చిన్న మొత్తంలో డబ్బులు దాచుకునేందుకు ఎక్కువగా చీటీలు కడుతూ ఉంటారు. నమ్మకం కలిగిన వాళ్ల దగ్గర కొద్ది కొద్దిగా నెలవారిగా డబ్బులు జమ చేసుకుంటారు. ఏదైనా అనుకోని అవసరం, లేదంటే పిల్లల చదువులు, ఇంటి అవసరాలు, పెళ్లిళ్లకు, హాస్పిటల్ ఖర్చులకు అవసరానికి ఉపయోగపడతాయని చీటీలు కడుతూ డబ్బులు పోగుచేసుకుంటారు. ఇదే విధంగా ఓ మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి తిరుచానూరు (Tiruchanur)పద్మావతి అమ్మవారి (Padmavati temple)ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతాప్ స్వామి( Pratap Swamy)అలియాస్ బాబు స్వామి(Babu Swamy) దగ్గర చీటి(Chits) కడుతూ వచ్చాడు. నమ్మదగిన వ్యక్తి కావడంతో పెద్ద మొత్తంలో చీటీలు కడుతూ వచ్చాడు. అయితే ఆ చీటి గడువు ముగిసి మూడేళ్లు అవుతుంది. రావాల్సిన సొమ్ము మాత్రం వారి వద్ద నుంచి రావడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసాడు....కానీ ఫలితం లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో ఇక సొమ్ము రాదనుకున్నాడేమో కానీ... ఆత్మహత్య చేసుకున్నాడు.
చీటిల పేరుతో అర్చకుడి మోసం..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవేంకటేశ్వరుని దేవేరైనా పద్మావతి అమ్మ వారు వెలిసిన తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో ప్రధాన అర్చక పదవిలో కొనసాగుతూనే బాబు స్వామి ప్రైవేట్ గా చీటీలు వ్యాపారాన్ని ప్రారంభించాడు. కరోనా మహమ్మారి ప్రభలిన సమయంలో చీటిల వ్యాపారంలో నష్టాలు రావడంతో..బాబు స్వామి కొందరికీ చీటి డబ్బులు ఇవ్వనట్లుగా తెలుస్తోంది. దీంతో చీటి డబ్బులు ఇవ్వకుండా గత మూడేళ్లుగా ఇబ్బందులకీ గురి చేస్తావుండడంతో..మనస్తాపం చెంది తిరుచానూరు పంచాయతీ ఎస్వీపి కాలనీకి చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యాపారి ఆత్మహత్య..
స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న నితిన్..తన అవసరాల నిమిత్తం ఇంటి పరిసరాల్లో నమ్మకంగా చీటిలు నిర్వహిస్తున్న వాణి,ఆమె భర్త ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి వద్ద పెద్ద మొత్తంలో చీటీలు వేసాడు.చీటీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావాలిసిన డబ్బులు ఇవ్వకుండా దంపతులు ఇద్దరు రోజుకో మాట చెబుతుండడంతో..అడిగి అడిగి విసిగి వేసారిన నితిన్ మనస్తాపం చెంది తన చావుకు కారణం చీటి నిర్వహిస్తున్న దంపతులే కారణమంటూ లేఖ రాసి మూడు రోజుల క్రిత్తం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అర్చకుడిపై చర్యలకు డిమాండ్ ..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. నితిన్ చావుకు కారణమైన చీటి నిర్వాహకులు వాణి,ఆమె భర్త బాబు స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు ఇద్దరు ఇంటికి తాళం వేసి పరారయ్యరు. దీంతో పోలీసులు వీరు ఇరువురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 48గంటలు గడస్తా వుండడంతో ఆలయ ప్రధాన అర్చకుడైనా బాబు స్వామి పై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.