Home /News /andhra-pradesh /

TIRUPATI TIRUAMALA LADDU PRASADAM HAS THREE HUNDRED YEARS OF HISTORY AS IT TURNED FAVOURITE FOR DEVOTEES FULL DETAILS HERE PRN TPT

Tirumala Laddu: తిరుమల లడ్డూకి అంత చరిత్ర ఉందా..? లడ్డూ ప్రసాదం ఎలా ప్రారంభమైందంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

నైవేద్య ప్రియుడు.. సకల పాపాలు తొలగించే శ్రీ శ్రీనివాసుడికి (Sir Venkateswara Swamy) ఎన్నో ప్రసాదాలు ఆగమోక్తంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూ (Tirumala Laddu Prasadam) కి ఉన్న ప్రాధాన్యతే వేరు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  నైవేద్య ప్రియుడు... సకల పాపాలు తొలగించే శ్రీ శ్రీనివాసుడికి (Sir Venkateswara Swamy) ఎన్నో ప్రసాదాలు ఆగమోక్తంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూ (Tirumala Laddu Prasadam) కి ఉన్న ప్రాధాన్యతే వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగానూ., భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగానూ లడ్డూలు ప్రాచుర్యం పొందాయి. అందుకే లడ్డూకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీవారి ప్రసాదం అంటేనే లడ్డూ మాత్రమే అనేంతగా భక్తులు ఇష్టపడుతుంటారు. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్రే ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచి లడ్డూ ప్రసాదాన్ని తాయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు. లడ్డులను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించే వారు. లడ్డూ తయారీ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా..?

  తిరుమల లడ్డూలు అంటేనే తెలియని హిందువులు ఉండరు. తిరుమలకి ఇరుగు పొరుగు వారు వెళితే మాకు లడ్డు ప్రసాదం తీసుకురండి అంటూ అడుగుతారు. తిరుమలకి వెళ్లి లడ్డూ ప్రసాదంతో ఇంటికి రాగానే పూజ గదిలో ఉంచి పూజ చేసి... అనంతరం ఇరుగు పొరుగు వారికీ పంచుతారు. ఎంతో భక్తి భావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. ప్రస్తుతం టీటీడీ పోటు నుంచి రోజుకు 3 నుంచి 4 లక్షల లడ్డులా తయారీ సామర్ధ్యం టీటీడీ వద్ద ఉంది.

  ఇది చదవండి: శాటిలైట్ ప్రయోగం లైవ్ లో చూస్తారా..? అయితే ఇలా రిజిస్టర్ చేసుకోండి..


  అసలు చరిత్ర బుందితో ప్రారంభం అయింది. ఆ బూందీ ప్రసాదమే ప్రస్తుతం మనకు ఇస్తున్న లడ్డు ప్రసాదంగా మారింది. లడ్డును చక్కెర, శనగపిండి, నెయ్యి, నూనె, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూప్ట్స్ తో తయారు చేస్తారు. ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారికి
  సమర్పించే బూందీ ప్రసాదం లడ్డూగా 1715 ఆగస్టు 2వ తేదీగా కొందరు చెప్తుంటారు.

  ఇది చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. జూలై నెలలో ఎంతొచ్చిందంటే..!


  బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, తిరుమల నెలలలో వచ్చే అనూహ్య భక్తుల రద్దీ కొరకు అధిక సంఖ్యలో లడ్డులను తయారు చేస్తుంది టీటీడీ. సుమారు ఐదు వందల మందికి పైగా లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్‌ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు. బూందీ క్రేట్స్‌తో పాటు లడ్డూలను మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం.

  ఇది చదవండి: శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందా..? స్వామి వెనుక సొరంగం నిజమేనా.! న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!


  అగ్ని ప్రమాదాలు జరుగకుండా 40 థర్మల్ స్టవ్ లను లడ్డూపోటులో వినియోగిస్తున్నారు. మరో 40కి పైగా స్టవ్ లను త్వరలోనే అమర్చనున్నారు టీటీడీ అధికారులు. అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో "జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్" కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి అనంతరం అంతే భక్తిగా భావించి కళ్ళకు అద్దుకొని తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు.

  ఇది చదవండి: శ్రీవారి వైభవోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆ ఉత్సవాల ప్రాముఖ్యత ఇదే..!


  307 ఏళ్ల క్రిందట మొదలైన లడ్డు ప్రసాదం.., వందల ఏళ్లుగా మనకు ఎంతో ఇష్టమైన ప్రసాదంగా రూపాంతరం చెందింది. ఎన్నో మార్పులు చేర్పులు నడుమ 1803లో బూందీగా పరిచయమైందని.., 1940 నాటికి లడ్డూగా మారి స్థిరపడినట్లు కొందరు అర్చకులు చెప్తున్నారు. సాధారణ లడ్డూలు కల్యాణోత్సవం లడ్డూ. పరిమాణంలో ఉండేదట. ధర కూడా ఎనిమిదణాలే ఉండేదట. అలా లడ్డూలు 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయలకు ప్రస్తుతం ఒక్కో లడ్డు 50 రూపాయలకు విక్రయిస్తోంది టీటీడీ.  ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కల్యాణోత్సవం లడ్డూ, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 92 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు మరి కొందరు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  తదుపరి వార్తలు