GT Hemanth Kumar, Tirupathi, News18
ఈజీ మనీ అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇంట్రెస్ట్. కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.. ఇంట్లో కూర్చొని కోటీశ్వరులైపోవాలని చాలా మంది చూస్తుంటారు. అలాంటి దారుల్లో వెళ్లేవాళ్లు ఎప్పటికైనా చట్టంముందు దోషులుగా నిలబడాల్సిందే. ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. చదువులేనివారితో పాటు బాగా చదువుకున్నవాళ్లు కూడా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు బాగా చదువుకున్నవారే అవుతున్నారు. ఇదే క్రమంలో ఈజీమనీకి అలవాటుపడ్డ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. బెట్టింగ్ ఆండ్రాయిడ్ యాప్ రూపొందించాడు. రూ.100 చెల్లిస్తే 24గంటల్లో 300 వచ్చేలా చూపిస్తూ అందర్నీ నమ్మించాడు. డబ్బులపై ఆశతో టెంప్ట్ అయి డబ్బులు పెట్టినవారిని అడ్డంగా ముంచేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లోని చిత్తూరు నగరానికి చెందిన నితీష్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వచ్చేజీతం సరిపోలేదో.. లేక మరింత డబ్బులు కావాలని అత్యాశ పడ్డాడో తెలియదుగానీ.. పనిచేయకుండానే డబ్బు సంపాదించాలనే కన్నింగ్ స్కెచ్ వేశాడు. నాలుగు డబ్బులు వెనకేసుకుంటే చాలు అనే మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting) కోసం యాప్ ను రూపొందించాడు. ఇందుకోసం సోషల్ మీడియా (Social Media) ను వేదికగా తీసుకొని జనంలో ఆశలు కల్పించాడు. ముఖ్యంగా యువతే టార్గెట్ గా చేసుకొని వారిని ట్రాప్చేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టేలా చేశాడు.
ఫేస్ బుక్ (Face Book), ట్విట్టర్ (Twitter), టెలిగ్రామ్ (Telegram), వాట్సాప్ (Whatsapp) వంటి సోషల్ మీడియా వేదికల్లో రెడ్డి అన్న బుకింగ్ యాప్, మహదేవ ఆన్ లైన్ బుకింగ్ యాప్ పేరుతో ఫైస్ బుక్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి.. బెట్టింగ్ యాప్ గురించి సర్క్యులేట్ చేశాడు.గ్రూపు ద్వారా వీరిని సంప్రదించిన వారి వివరాలను సేకరించి నెమ్మదిగా వారిని మాయ మాటలు చెప్పి వారి దగ్గ నుండి అధిక మొత్తంలో నగదును వసూలు చేసేవాడు. తాము పెట్టిన పెట్టుబడిని అదనపు ఆదాయం రాక పోగా పెట్టిన సొమ్ము కూడా రాక పోవడంతో భాధితులు నితీష్ రెడ్డిని సంప్రదిస్తే వారి నెంబర్ లను బ్లాక్ లిస్టులో పెట్టేవాడు. దీంతో తాము మోస పోయాంమని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయచడంతో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సాయంతో దాదాపు నెలరోజుల పాటు శ్రమించి నిందుతుడ్ని పట్టుకున్నారు. నిందుతుకి చెందిన వివిధ బ్యాంక్ ఎకౌంట్లలోని రూ.33,01,633లను సీజ్ చేశారు. నితీష్ తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. ఈ స్కామ్ లో మరికొంతమంది పాత్ర ఉందని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.