Unique Tradition: గబ్బిలాలను పూజిస్తే దోషాలు పోతాయా..? ఏపీలో ఓ గ్రామంలో వింత ఆచారం..

చిత్తూరు జిల్లాలో వింత ఆచారం

ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. కొన్నిచోట్ల మాత్రం పెద్దలు వారసత్వంగా ఇచ్చిన వెళ్లిన ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనకు అక్కడక్కడా పెళ్లిళ్లు, పూజలు, జాతరల్లో కొన్ని వింత ఆచారాలు కనిపిస్తుంటాయి.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. కొన్నిచోట్ల మాత్రం పెద్దలు వారసత్వంగా ఇచ్చిన వెళ్లిన ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనకు అక్కడక్కడా పెళ్లిళ్లు, పూజలు, జాతరల్లో కొన్ని వింత ఆచారాలు (Unique Traditions) కనిపిస్తుంటాయి. కొన్ని గ్రామాల ఆచార నియమాలు చూస్తే మనం కూడా నోరెళ్లబెట్టక తప్పదు. ఎందుకు అంటే వారి ఆచార వ్యవహారాలు అంత విచిత్రంగా ఉంటాయి. అలా పెద్దలిచ్చి వెళ్లిన ఆచారాన్ని ఓ గ్రామ్ తూ.చ తప్పకుండా పాటిస్తోంది. అంతేకాదు ఆ ఆచారమే ఆ గ్రామానికి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. అసలు వారి ఆచార వ్యవహారాలు ఏంటి...? దానివల్ల వారికేం మేలు జరుగుతుంది..? ఇంతకు వింతైన ఆచారం పాటించే ఆ గ్రామం ఎక్కడ ఉంది..? ఆ ఆచారాన్ని వాళ్లు ఏ విధంగా పాటిస్తున్నారు..? అనేది తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాకు వెళ్లాల్సిందే..!

  వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా (Chittoor District), రామచంద్రపురం మండలంలోని నడవలూరు గ్రామంలో వింత ఆచారాన్ని ఇప్పటికీ గ్రామస్తులు ఆచరిస్తున్నారు. గ్రామంలో గబ్బిలాలను దేవతలుగా కొలుస్తారు. అవే వారిని కష్టాల నుంచి గట్టెక్కుతాయని భావిస్తారు. గ్రామ ముఖద్వారం వద్ద 11 చింత చెట్లు స్వాగతం పలుకుతుంటాయి. వాటికి వందల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతుంటాయి. కొత్తగా ఎవరు వెళ్లినా ఆ గబ్బిలాలను చూసి భయపడిపోతారు. కానీ అవే వారికి గ్రామదేవతలు.

  ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్  దశాబ్దాల ఆచారం...
  ఈ గ్రామం వారు గబ్బిలాలను గ్రామదేవతగా కొలిచే సాంప్రదాయం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. గబ్బిలాలను దేవతలుగా కొలవడం వెనుక పెద్దకథే ఉంది. సాధారణంగా పిల్లలు బరువు తక్కువగా, ఇతర ఆరోగ్య సమస్యలతో పుడుతుంటారు. ఏదో దోషం వల్లే పిల్లలకు అలా అయిందని గ్రామస్థులు భావిస్తారు. దీనినే పెద్దలు పక్షి దోషమని కూడా పిలుస్తారు.

  ఇది చదవండి: జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం.. కిడ్నాపర్లు వీళ్లే.. ఎలా దొరికారంటే..!  పూజలు చేస్తే దోషం పోతుందట..
  అనారోగ్యాలతో జన్మించిన చిన్నారులను గబ్బిలాల ఆవాసం అయిన చింతచెట్టు వద్ద తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. ప్రత్యేక పూజలు చేసి ఇక చెట్టు మొదల్లో ఉన్న తొర్రల నడుమ చిన్నారులను ఉయ్యాల ఊపినట్లు చూపిస్తారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత పసికందులకు చెందిన వస్త్రాన్ని చెట్టుకి కట్టడంతో దోషం తొలగుతుందని గ్రామస్థుల నమ్మకం. గబ్బిలాలు ఉండటం వల్లే తమ గ్రామం చల్లగా ఉందని స్థానికులు భావిస్తారు.

  ఇది చదవండి: ఆమెపాలిట శాపంగా మారిన పవర్ కట్... ఆ నలుగుర్ని ఏంచేసినా పాపం లేదు..  హానిచేస్తే కఠిన శిక్షతప్పదు...
  ఇక రాత్రంతా ఆహారం కోసం వేటకు వెళ్లి పగలు చింత చెట్లపై ఊగిసలాడే గబ్బిలాలకు ఎవరైనా కీడు తలపెడితే గ్రామస్తులకు కోపం నషాలానికి అంటుతుంది. అలాంటివారిని చింత చెట్టుకు కట్టేసి బడితెపూజ చేస్తారు. గబ్బిలాల వల్ల కరోనా వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు వచ్చినా గ్రామస్తులు వీటికి ఎలాంటి హాని తలపెట్టలేదు. పైగా వాటిని కంటికిరెప్పలా కాపాడుకున్నారు. ఈ ఆచారాన్ని ఆ ఒక్క గ్రామంలోనే కాకుండా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు పాటిస్తారు. చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. అలాగే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పూజలు చేయిస్తారని గ్రామస్తులు చెప్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: