హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mobile Theft: మీ మొబైల్ పోయిందా.. ఈ నెంబర్ కు మెసేజ్ పంపండి.. ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు

Mobile Theft: మీ మొబైల్ పోయిందా.. ఈ నెంబర్ కు మెసేజ్ పంపండి.. ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, Tirupathi, News18


Mobile Theft:  ప్రయాణాల్లో  ఏ మాత్రం అజాగ్రత్త వహించినా.. రెప్ప తెరిచి మూసే లోపే..  మన చేతిలోని మొబైల్ ఫోన్ మాయం (Mobile Phone Theft) చేస్తారు కేటుగాళ్ళు. ఇక పోగొట్టుకుంది ఎంత ఖరీదైన మొబైల్ (Costly Mobile) అయినా సరే దానిని కనుగొనటం చాల కష్టం. అయితే గూగుల్ అకౌంట్ (Google Account), ఆపిల్ అకౌంట్ (Apple account) ఉన్న మొబైల్ ఆన్ లో ఉంటే వాటిని కనిపెట్టే సౌలభ్యం ఉందని మీకు తెలుసా..? కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే వాటిని కనుగొనడం కష్టమే.. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ట్రాకర్ల సహాయంతోనే ఆ మొబైల్ ను కనిపెట్టగలం. అందుకు మొబైల్ ఫోన్ యొక్క ఐఎంఈఐ నుంబర్ తప్పనిసరి. అలాంటి సాఫ్ట్ వెర్ కేవలం కొంతమంది హ్యాకర్లు దగ్గర ఉంటుంది. సైబర్ క్రైమ్ పోలీసుల (Cyber Crime Police) దగ్గర కూడా ఇలాంటి ట్రాకర్ ఉంటుంది. హ్యాకర్ల దగ్గరకు మనం వెళ్లలేం. ఇక పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఐఎంఈఐ నెంబర్ పొందు పరచాలని.. ఆ తరువాత మొబైల్ ఎప్పుడు దొరికితే అప్పుడు మన చేతికి ఇస్తారు పోలీసులు.


అయితే  ఇంత ప్రాసెస్ అవసరం లేదంటున్నారు అనంతపురం పోలీసులు. సింపుల్ గా ఓ బోట్ ద్వారా మీ మొబైల్ ఫోన్ వెతికి పెడుతామంటున్నారు..? ఇంతకీ ఈ బోట్ ఏంటి..  ఎలా పని చేస్తుంది..? ముబైలు పోయినా ఎలా పసిగడుతుంది.. ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొబైల్ పోగొట్టుకున్న వారికీ వరంలా మారుతుంది చాట్‌ బాట్.తిరిగి తిరిగి విసుగు చెందాల్సిన పనిలేకుండా సులభమైన మార్గంలో ట్రాకింగ్ సిస్టంను అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో రూపొందించారు. అసలు ఈ చాట్ బోట్ ఎలా పని చేస్తుందంటే..?  వివిధ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్‌ పోగొట్టుకున్న వారు., చోరీకి గురైనట్లు గుర్తించిన వారు.. ముందుగా 94407 96812 నంబర్‌ వాట్సప్‌కు ఆంగ్లంలో ‘హాయ్‌’ లేదా ‘హెల్ప్‌’ అని మెసేజ్‌ పంపాలి.


మీ మెసేజ్ వాట్స్అప్ లో డెలివరీ అయినా వెంటనే వెల్‌కమ్‌ టు అనంతపురం పోలీస్‌ పేరుతో లింకు వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే అందులో గూగుల్‌ ఫార్మాట్‌ లో ఓ వెబ్ సైట్ ఓపెన్‌ అవుతుంది. అందులో జిల్లా, పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్ట్‌ నంబర్‌, పోయిన ఫోన్‌ మోడల్‌, ఐఎంఈఐ నంబర్‌, మిస్సయిన ప్రాంతం తదితర వివరాలను నమోదు చేయాలి.అలా వివరాలు నమోదు చేయగానే ఇలా సాంకేతిక నిపుణుల బృందానికి ఫిర్యాదు వెళ్తుంది. దీనిని పర్యవేక్షించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో 8 మందితో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది.


ఇదీ చదవండి : 45 ఏళ్లు నిండిన మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’.. ఎలా దరఖాస్తు చేయాలి? ఆఖరి తేదీ ఎప్పుడు? అర్హతలేంటి?


చాట్‌ బోట్‌ ద్వారా ఫోన్ల ఆచూకీ లభిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 24 నాటికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 7,603, ఇతర జిల్లాల నుంచి 2,856, ఇతర రాష్ట్రాల నుంచి 202 మంది  వివరాలు పంపారు. ఇప్పటి వరకు 10,661 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 2,100 ఫోన్ల ఆచూకీ కనుక్కొని బాధితులకు అందజేశారు. 2,950 ఫోన్ల వివరాలు తెలిశాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఈ సేవలను గుర్తించి టెక్నాలజీ సభ 2022 అవార్డుకు ఎంపిక చేసింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Find mobile, New smart phone