TIRUPATI THIS SECRET GODDESS IS PROTECTING DEVOTEES FROM ACCIDENTS IN TIRUMALA GHAT ROAD IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Tirumala Secrets: శ్రీవారి భక్తులకు ఆ తల్లే శ్రీరామ రక్ష.. ఘాట్ రోడ్డులో రహస్య శక్తి... ఎక్కడుందంటే..!
తిరుమల ఘాట్ రోడ్డు
పచ్చని చెట్ల నడుమ మెలికలు తిరిగే ఘాట్ రోడ్డులో ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రయాణం. శ్రీవారి దర్శనార్థం (Tirumala Darshan) తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు హరిత తోరణాలు స్వాగతం పలికి.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది తిరుమల ఘాట్ రోడ్డు.
పచ్చని చెట్ల నడుమ మెలికలు తిరిగే ఘాట్ రోడ్డులో ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రయాణం. శ్రీవారి దర్శనార్థం (Tirumala Darshan) తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు హరిత తోరణాలు స్వాగతం పలికి.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది తిరుమల ఘాట్ రోడ్డు. ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. అదే నెల పదో తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. మొదటగా ఈ ఘాట్ రోడ్డులో ఎద్దుల బళ్లు, గుర్రపు బళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. తిరుమల నుంచి రాత్రి 7 గంటలు దాటితే బస్సులే ఉండేవి కావు. బస్సులు పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది కూడా పూర్తయింది.
తిరుమలకు రెండు ప్రధాన రహదారులైన ఘాట్ రోడ్డులను అద్దంలా తీర్చిదిద్దారు. అప్పటి నుండి కొండకు వెళ్ళేందుకు ఓ ఘాట్, కొండ దిగేందుకు మరోక ఘాట్ యాత్రికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఏడాది శ్రీనివాసుడి దర్శనంకు పెరిగే భక్తులతో రద్దీ కారణంగా ఘాట్ రోడ్డులో వాహనాల సంఖ్య అధికం అయ్యాయి. ఈక్రమంలో మొదటి ఘాట్ రోడ్డులో అధిక మలుపులు కారణంగా నిత్యం యాత్రికులు ప్రమాదాల బారిన పడేవారు. ఎక్కవ శాతం మోకాళ్ళ మెట్లు వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు వద్ద ప్రమాదాలు చోటు చేసుకోవడంతో యాత్రికులు కూడా మృత్యువాత పడేవారు.
ప్రమాదాల నివారించేందుకు తీవ్ర ఆలోచనలో పడిన టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఘాట్ రోడ్డులో ప్రమాదాలను మాత్రం నిరంతరించలేక పోయింది. అప్పుడే టీటీడీ ఆగమ పండితులు సలహాల మేరకు మోకాళ్ళ పర్వతం వద్ద ఓ శక్తి మంత్రం రూపంలో దేవతను ప్రతిష్టించారు. అప్పటినుండి ఘాట్ రోడ్డులో చిన్న చిన్న ప్రమాదాలు పూర్తిగా తప్ప పెద్ద ప్రమాదాలు జరిగింది లేదు. ఇంతకీ ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు ప్రతిష్ఠించిన అమ్మవారి ఎవరూ అంటే..?
దేశ విదేశాల్లో అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డులు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఘాట్ రోడ్డుకు ఒక్కో చరిత్ర ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో తిరుమల ఘాట్ రోడ్డుకు ఉన్న ప్రత్యేకతే వేరు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకువిచ్చేసే భక్తులు ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణించాల్సిందే. తిరుమల నుండి తిరుపతికి ప్రయాణం సాగించే మొదటి ఘాట్ రోడ్డులో అత్యంత క్లిష్టమైన మలుపులు అధిక సంఖ్యలో ఉంటాయి.
ఈ మలుపుల్లో మోకాళ్ళ పర్వతంకు సమీపంలో ఉన్న అతి ప్రమాదకరమైన మలుపులో 2004 వరకూ ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకే ప్రాంతంలో అధికంగా ప్రమాదానికి గురి కావడం గుర్తించిన టిటిడి అధికారులను, పండితులను కారణం లోపాలపై అన్వేషణ సాగించారు. మలుపు వద్ద ప్రమాదాల నివారణకు బారికేడ్లు, ఇనుప రాడ్లను ఏర్పాటు చేసి వాహన వేగ నియంత్రణకు సిబ్బందిని ఏర్పాటు చేసినా యాత్రికులు నిత్యం ప్రమాదానికి గురి అయ్యే వారు. టీటీడీ ఆగమ పండితుల సలహాల మేరకు మోకాళ్ళ మొట్లు ప్రాంతంలో 2004లో సీతాలమ్మ అమ్మవారిని యంత్రం రూపంలో ప్రతిష్టించారు.
ముఖ్యంగా దేవతా స్వరూపంను రేఖా మంత్రంగా, సూక్ష్మ రూపంలో, బీజాక్షరాల రూపంలో చిత్రించే దానినే యంత్రంగా పిలుస్తామని వేద పండితులు అంటున్నారు. విగ్రహం, యంత్రం వంటి రెండు విధాల్లో మాత్రమే భగవంతుని ప్రతిష్టించగలమని ఆగమ, పురాణాలు శాస్త్రాల్లో చెప్పబడి వుందని అంటున్నారు. ముఖ్యంగా శీతల దేవి గ్రామ రక్షణ శక్తిగా ఉంటుందని, ఈమె గాడిద పై కూర్చుని తలపై చాటను ధరించి, ఒక చేతిలో పొరక, మరొక చేతిలో చెంబులో నీళ్లను పెట్టుకొని అమ్మవారు ఉంటారని వేద పండితులు అంటున్నారు.
ముఖ్యంగా దుష్ట శక్తులు, ఇతర భాధలు వదిలించుకునేందుకు గ్రామం మధ్యలో గ్రామ శక్తిగా శీతల దేవి ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పారస ఆగమ స్మృతి గ్రంథంలో గ్రామ శక్తి ప్రతిష్ట విధానం చెప్పబడి ఉందన్నారు. రుద్రయామణ తంత్రం, కుల వర్ణ తంత్రంలో శీతల దేవి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి అన్నారు. అన్నిచోట్ల విగ్రహ రూపంలో చెక్క పడకుండా పరమేశ్వరుడు ఉపదేశించిన యంత్ర శాస్త్రం బద్దంగా రేఖరూపంలో, బీజాక్షరాలను యంత్రంగా స్థాపించడం జరుగుతుందన్నారు.
ఈ క్రమంలో 2002, 2003, 2004 సంవత్సరాల్లో దిగువ ఘాట్ రోడ్డులో జరిగే ప్రమాదాల నివారణకు ఆగమ పండితుల సూచనల మేరకు టిటిడి స్ధాపించడం జరిగిందని, శీతలదేవిని ప్రత్యేక పూజా విధానం ద్వారా మోకాళ్ళ మెట్ల సమీపంలో స్ధాపించడం ద్వారా ఆనాటి నుండి నేటి వరకూ ఘాట్ రోడ్డులో ఘోరమైన ప్రమాదాలు జరగకుండా భక్తులను శీతలదేవి కాపాడుతూ వస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.