Home /News /andhra-pradesh /

TIRUPATI THESE TWO VILLAGES IN ANDHRA PRADESH HAS NO ROAD FACILITY LOCALS ARE FACING PROBLEMS FOR TRANSPORT FULL DETAILS HERE PRN TPT

Andhra Villages: కళ్ల ముందే నేషనల్ హైవే... కానీ వారు రోడ్డెక్కలేరు.. కారణం ఇదే..!

చిత్తూరు జిల్లా ఎగువబైలు, దిగువబైలు గ్రామాలు

చిత్తూరు జిల్లా ఎగువబైలు, దిగువబైలు గ్రామాలు

ఊరంటే.. గుడి, బడి, ఆస్పత్రి, తాగునీరు, దుకాణాలు. ఇలా అన్ని సౌకర్యాలు ఉండాలి. వీటన్నింటికీ చేరుకోవాలంటే రోడ్డు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లులేని ఊరు లేదు.

  GT Hemanth Kumar, News18, Tirupati

  ఊరంటే.. గుడి, బడి, ఆస్పత్రి, తాగునీరు, దుకాణాలు. ఇలా అన్ని సౌకర్యాలు ఉండాలి. వీటన్నింటికీ చేరుకోవాలంటే రోడ్డు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లులేని ఊరు లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని గిరిజన గ్రామాల్లో తప్ప రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంటుంది. కానీ రెండు గ్రామాలు మాత్రం ఇప్పటికీ రోడ్డులేక సతమతమవుతున్నాయి. ఆ పల్లెలు ఉన్నది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు. అవి ఉన్నది మైదాన ప్రాంతంలో.. అందునా ఓ హైవేకి కూతవేట దూరంలో. ప్రజలు ఎంతవేడుకున్నా... ప్రభుత్వాలు మారినా.. తమ తలరాతలు మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు పంచాయతీ పరిధిలోని ఎగువ దొనబైలు, దిగువ దొనబైలు గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు.

  ఈ రెండు గ్రామాలకు కేవలం కాలిబాట మాత్రమే శరణ్యం. వేసవికాలంలో తప్ప మిగిలిన రోజుల్లో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్ధితి. కేవలం 3 కిలోమీటర్ల మేర రోడ్లు వేయకపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రాని దుస్థితిని ఈ రెండు గ్రామాల ప్రజమలు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు గ్రామాల్లో 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా దశాబ్దాలుగా తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం మాత్రం శూన్యం. ఎవరికైనా అనాగ్యం వస్తే డోలీపై ప్రధాన రహదారి వద్దకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వీరిది.

  ఇది చదవండి: తెలిసినవాడే కదా అని బైక్ ఎక్కిన యువతి.. గంట తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికెళ్లింది.. మధ్యలో ఏం జరిగిందంటే..


  మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న చీకలబైలు కొండలపై ఈ రెండు గ్రామాలున్నాయి. 3 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ఇక్కడి వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రతి పల్లెకు మండల కేంద్రాన్ని అసుసంధానం చేయాలనే ప్రభుత్వ ఆశయం ఇక్కడ అమలు కాకపోవడం గమనార్హం. అడవిలో లభించే కర్రలతో నిర్మించుకున్న మట్టి ఇళ్లు తప్ప పక్కా ఇళ్ల జాడే ఈ గ్రామాల్లో కనిపించవు. నేటికీ గ్రామంలో పూరిళ్లు దర్శనమి స్తున్నాయి.

  ఇది చదవండి: బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..


  గ్రామంలో చాలా కుటుంబాలు వలస వెళ్ళి పోవడంతో మిగిలిన వారు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కనీసం పండించిన పంటను సైతం అమ్ముకోలేని దీన స్దితి. చూట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం అయినా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాలా మంది గ్రామం విడిచి వెళ్ళడంతో కూలిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లు, కాలువలు నిర్మించక పోవడంతో చిన్నపాటి వర్షానికి బురదగా మారిపోతోంది. ఎండాకాలం దుమ్ముమయంగా మారుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‌ ఈ గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కూడా అంతంతమాత్రమే. కేవలం వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు.

  ఇది చదవండి: చిన్న క్లూ లేకుండానే మర్డర్ మిస్టరీని ఛేదించిన కానిస్టేబుల్.. అది ఎలాగంటే..!


  ఇక గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకే అందుబాటులో ఉంది. ఆ తర్వాత చదువుకోవాలంటే చీకలబైలు వెళ్లాలి. రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు ఊరుదాటి వెళ్లలేకపోతున్నారు. దీంతో చదువుకు స్వస్తి పలకాల్సి వస్తోంది. దశాబ్దాలుగా అధికారులకు ఎన్ని సార్లు సమస్యలను విన్నవించినా ఇదిగో, అదిగో‌ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప తమకు సౌకర్యాలు కల్పించ లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Tirupati

  తదుపరి వార్తలు