Andhra Pradesh: ఏపీలోని ఈ మండలాల్లో హై అలర్ట్.. లాక్ డౌన్ తప్పదేమో..!

ప్రతీకాత్మక చిత్రం

Corona Third Wave: థర్డ్ వేవ్ పిల్లలపై ఉంటుందని కొందరు హెచ్చరిస్తుంటే.. మరి కొందరు రూరల్ ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ఏడాదిన్నరగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఫస్ట్ వేవ్ లో లక్షలాది మందిని బలిగొన్న మహమ్మారి.. సెకండ్ వేవ్ లో అంతకంటే తీవ్రంగా ప్రజలపై పంజా విసింరింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఐసీఎమ్ఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తోంది. థర్డ్ వేవ్ పిల్లలపై ఉంటుందని కొందరు హెచ్చరిస్తుంటే.. మరి కొందరు రూరల్ ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ లక్షల్లో కేసులు నమోదైనా.. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. ఐతే రాష్ట్రమంతటా తగ్గుదల కనిపిస్తున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం ప్రతిరోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తమిళ, కర్ణాటక రాష్ట్రాలకు చిత్తూరు జిల్లా సరిహద్దు కావడంతో ఇతర రాష్ట్రాలకు అధికంగా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. టమోటా నుంచి ఇతర కూరగాలయ వరకు జిల్లా నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర ధాన్యాలు, ఇతర సరుకులు చిత్తూరు జిల్లా మార్గంగానే రవాణా సాగుతుంది.

  ప్రస్తుతం చిత్తూరు జిల్లా రురల్ మండలాల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు ఒక ఎత్తు అయితే... జిల్లాలో నమోదు అయ్యే కరోనా కేసులు ఒక ఎత్తుగా నిలుస్తోంది. ముఖ్యంగా 35 మండలాల్లో వైరస్ తీవ్రత కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా 10శాతాని కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. లేటెస్ట్ అప్ డేట్ ఇదే..


  ఈ నెల 11వ తేదీ నుంచీ నేటి వరకూ పీలేరు, రేణిగుంట, ఏర్పేడు, పెనుమూరు, జీడీనెల్లూరు, కేవీపల్లె, తవణంపల్లె, కురబలకోట, తిరుపతి రూరల్, కేవీబీపురం, ఎర్రావారిపాళ్యం, చంద్రగిరి, చిత్తూరు, పాకాల, వరదయ్యపాళ్యం, బైరెడ్డిపల్లె, పలమనేరు, విజయపురం, వి.కోట, చిన్నగొట్టిగల్లు, మదనపల్లె, గుడుపల్లె, కలికిరి, నగరి, కలకడ, సోమల, పులిచెర్ల, గుడిపాల, వాల్మీకిపురం, చౌడేపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి, గుర్రంకొండ, పలమనేరు, రామకుప్పం మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదు అవుతున్నాయి.

  ఇది చదవండి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్... జాబ్ పర్మినెంట్ కావాలంటే ఈ పరీక్షలు పాసవ్వాల్సిందే...!


  అలాగే మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నాయి. ఆయా మండలాల్లో జాతరలు, వివాహ వేడుకలను అనుమతించడంతో జనం మాస్కులు లేకుండా పాల్గొనడం వల్లే కేసులు పెరుగుతున్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఇందుకు ముఖ్య కారణం లేకపోలేదు. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో గ్రామ దేవతలకు పూజ కార్యక్రమాలు, తిరునాళ్ళు, జాతరలు నిర్వహించారు. దీంతో ప్రజలు భౌతిక దూరం పాటించడం దేవుడికి ఎరుక. కనీసం మాస్కులు ధరించకుండా జాతరలో పాల్గొనటమే మరొక కారణంగా కనిపిస్తోంది. దాని వల్ల కూడా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని... అవసరమైతే కర్ఫ్యూ సడలింపుల సమయం తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు.

  ఇది చదవండి: అక్టోబర్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు... ప్రభుత్వం అనూహ్య నిర్ణయం...?

  Published by:Purna Chandra
  First published: