Home /News /andhra-pradesh /

TIRUPATI THESE IS THE MAIN REASONS TO AUTO ACCIDENT TO KILLED 5 LABOR WOMEN IN SRI SATYA SAI DISTRICT NGS

Auto Catches Fire: ఉడుతదే పాపం అంటున్నారు అధికారులు.. కానీ ఆటోపై ఇనుప మంచం.. చేతికందే ఎత్తులో కరెంటు వైర్లు.. మరి తప్పెవరిది?

ఘటనా స్థంలో దృశ్యం

ఘటనా స్థంలో దృశ్యం

Auto Catches Fire: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది..? ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అవ్వడానికి ప్రధాన కారణం ఎవ్వరు..? అధికారులు మాత్రం ప్రమాదంతో మతకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ పాపం అంతా ఉడుతదే అంటున్నారు.. కానీ వాస్తవం ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  Auto Catches Fire: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)రోడ్లు రక్తమోడుతున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents)తరచూ పెరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే ఎక్కువ.. మొదటిది అధికారుల నిర్లక్ష్యం అయితే.. రెండోది డ్రైవర్లు చేసే తప్పులు.. ఆ వాహనాల యజమానుల కాసుల కక్కుర్తి.. నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం.. మద్యం మత్తులో వాహనాలు నడపడం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. అతి వేగం ఇలా కారణం ఏదైనా.. ప్రమాధాలకు మానవ తప్పిదాల ప్రధామ కారణం అవుతున్నాయి. తాజాగా ఏపీలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే..? ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. అది కూడా వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు.. వర్షాలు కురుస్తుండడంతో చేతినిండా పనులు ఉంటాయని ఆశతో ఉన్న ఆ కూలీలను ప్రమాదం బలి తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

  వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదానికి గురైన ఆటోలో 11మందిని ఎక్కించారు. పొలం పనులకు వెళ్తుండగా రకరకాల పనిమూట్లతో ఆటోను నింపేశారు. ఆటోలో విపరీతంగా లోడ్ వేశారు. అది చాలదన్నట్టు ఆటో టాప్ మీద ఓ ఇనుప మంచం కట్టి తీసుకెళ్తున్నారు. అదే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని ఆటోలో ఉన్నవారు ఎవరూ ఊహించలేకపోయారు.

  కూలీలతో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి దగ్గరికి రాగానే హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడింది. ఆటోపై ఇనుప మంచం ఉండటంతో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అయితే ఆ తెగి పడినవి పవర్ ఫుల్ విద్యుత్ తీగ కావడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారు. అందరూ చూస్తూ ఉండగానే మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి ఆటోపై ఉన్న ఇనుప మంచమే కారణం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యమే ఐదుగురి ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  ఇదీ చదవండి : కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు.. అధికారం సాధ్యంకాదని చంద్రబాబుకు తెలిసిపోయిందన్న సజ్జల

  ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం ఒక కారణం అయితే.. విద్యుత్ శాఖ అధికారుల వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ స్తంభంపై ఉన్న ఉడతే ప్రమాదానికి కారణం అని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు చెప్పుకొచ్చారు. ఉడత హైటెన్షన్ విద్యుత్ వైర్లను కొరకడంతో అవి తెగిపోయి ఆటోపై పడ్డాయని హరినాథరావు వివరణ ఇచ్చారు. ఆయన వివరణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉడత కొరికితే తెగిపోయే అంత బలహీనంగా ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజం చెప్పాలి అంటే ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. చెయ్యి ఎత్తితే అందేంత కిందకు ఉన్నాయి. వాటిలో అధిక ఓల్టేజీలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైర్లను ఎవరైనా తాకితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి : ప్రధాని రాకతో క్యాడర్ లో జోష్ వస్తుందా.. వైసీపీకి మోదీ ఇచ్చే సంకేతమేంటి?

  దీనిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేశామంటున్నారు స్థానికులు.. అయినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. వాటిని రిపేర్ చేయాలనే ఆలోచన చేయలేదంటున్నారు. అలా వదిలేయడంతో అవి మరింత కిందకు జారి.. ఇప్పుడు ఆ వైర్లే ఆటోకి తగిలి ఐదుగురి ప్రాణాలు పోయాయి. ఈ వ్యవహారంలో విద్యుత్ అధికారులు తమ తప్పు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని జనం మండిపడుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Road accident

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు