Home /News /andhra-pradesh /

TIRUPATI THEFT GANG ARRESTED IN TIRUPATI DISTRICT OF ANDHRA PRADESH AS THEY LOOTING UNEVEN THING FULL DETAILS HERE PRN TPT

Tirupati: వీళ్లో వెరైటీ దొంగలు.. ఏం చోరీ చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..

పోలీసుల అదుపులో దొంగల ముఠా

పోలీసుల అదుపులో దొంగల ముఠా

Titupati News: ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ యుగం నడుస్తోంది. ఏపని పూర్తి చేయాలన్నా కంప్యూటర్ తప్పనిసరి. ఇప్పుడిదే ఆ దొంగల ముఠాకు మంచి ఛాన్స్ ఇస్తోంది.

    GT Hemanth Kumar, News18, Tirupati

    ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ యుగం నడుస్తోంది. ఏపని పూర్తి చేయాలన్నా కంప్యూటర్ తప్పనిసరి. ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ ఉన్నాయి. ప్రభుత్వ స్కీమ్స్ నుంచి ఎగ్జామ్స్ అప్లికేషన్స్, జాబ్ ఇంటర్వూస్, వర్క్ స్ప్రేడ్స్ ఇలా ప్రతి ఒక్క పనిలో కంప్యూటర్ అవసరం ఎంతో ఎక్కువగానే ఉంది. అందుకే వాటిలోని హార్డ్ వేర్ పార్ట్స్ కు సైతం డిమాండ్ ఎక్కువ. అందుకే ఓ దొంగల ముఠా కంప్యూటర్లనే టార్గెట్ చేసింది. ప్రముఖ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలను టార్గెట్ గా పెట్టుకొని కంప్యూటర్ ఉప పరికరాలను దోచేందుకు పక్క ప్లాన్ రూపొందించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వెరైటీ దొంగతనానికి పోలీసులు చెక్ పెట్టారు.

    వివరాల్లోకి వెళ్ళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు (Chittoor District), తిరుపతి జిల్లా (Tirupati District) లో ఎన్నో ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్దొం దృష్ట్యా ప్రతి కళాశాలలోనూ కంప్యూటర్ ట్రైనింగ్ తప్పనిసరి. ఒక్కో కళాశాలలో అయితే ఏకంగా 100కు పైగా కంప్యూటర్లు ఉంటాయి. అలాంటి కళాశాలలు అయితే దొంగతనానికి మంచి ప్రదేశమని భావించిన ముఠా కొన్ని కళాశాలలపై టార్గెట్‌గా పెట్టుకున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కంప్యూటర్‌ ఉపకరణాలైన ర్యామ్‌, ప్రాసెసర్లకు మంచి గిరాకీ ఉంటుంది.

    ఇది చదవండి: ఏపీలో సరికొత్త దందా.. మీరు కొనే సినిమా టికెట్ నకిలీది కావొచ్చు.. బీ కేర్ ఫుల్..


    ఈ నేపథ్యంలో దొంగల ముఠా కంప్యూటర్‌ స్పేర్ పార్ట్స్ దొంగతనాలు చేయడం ఓ అలవాటు మలచుకున్నారు. 2010 నుంచి జిల్లాలోని 50 కళాశాలలలో దొంగల ముఠా కంప్యూటర్‌ ఉపకరణాల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దొంగలించిన ర్యామ్‌, ప్రాసెసర్‌, మానిటర్‌, సీపీయూలను చెన్నైలోని బర్మా మార్కెట్‌ కేంద్రంగా అమ్మకాలు సాగించారన్నారు. ఇప్పటి దాకా 20 లక్షలపైగా విలువ చేసే స్పేర్ పార్ట్స్ దొంగలించినట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో పక్క సమాచారంతో పూతలపట్టు మండలం, రంగంపేట క్రాస్‌ వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.

    ఇది చదవండి: తల్లి ప్రియుడి మర్మాంగం కోసిన యువతి.. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇలా..


    అలాగే వారి వద్ద నుంచి లక్షల రుపాయలు నగదు, ర్యామ్‌, ప్రాసెసర్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనియప్పన్‌ మురళీ, పుంగావనం శేఖర్‌, కడప జిల్లాకు చెందిన పసలవెంకటరెడ్డి, కందులవెంకట్‌, పుల్లెరి గోపిలు ప్రధాన నిందితులుగా ఉన్నారని వీరిపై గతంలో‌ పలు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. ధనార్జనకు సులువైన మార్గమని దొంగతనాని ఎంచుకుంటే ఊసలు ఎక్కేంచాల్సిదేనన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు