TIRUPATI THE TIRUMALA TIRUPATI DEVASTHANAMS RELEASE THE ONLINE QUOTA OF DARSHAN TICKETS FOR NOVEMBER AND DECEMBER SSR
Tirumala: శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్ల విక్రయాలు..
తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెల దర్శన టికెట్లను విడుదల చేసింది. 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే.. 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి.
తిరుమల:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిసెంబర్ నెల దర్శన టికెట్లను విడుదల చేసింది. 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే.. 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. దర్శన టికెట్ల కోసం ఏకంగా 7 లక్షల హిట్లు వచ్చాయంటే శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నిమిషాల వ్యవధిలోనే తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్ పూర్తి కావడం విశేషం. జియో క్లౌడ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేశారు. అయితే.. గతంలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో భక్తులకు సర్వర్ సమస్యలు తలెత్తేవి. ఈసారి మాత్రం ఎటువంటి సర్వర్ ఇబ్బందులు లేకుండానే సాఫీగా టికెట్ల విక్రయాలు సాగాయి.
రోజుకు 12 వేల చొప్పున టీటీడీ దర్శన టికెట్లను విడుదల చేసింది. సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అక్టోబర్ 23న విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. అక్టోబర్ 25న నవంబర్ నెలకు సంబంధించి వసతి గదుల కోటా విడుదల చేయాలని టీటీడీ భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.