TIRUPATI TENSION AT MLA NANDAMURI BALAKRISHNA HOUSE IN HINDUPURAM AS TDP CHALLENGES YCP ON DEVELOPMENT FULL DETAILS HERE PRN
Bala Krishna House: బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు.. కారణం ఇదే..!
ఎమ్మెల్యే బాలకృష్ణ (ఫైల్)
అనంతపురం జిల్లా (Anantapuram District) హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Bala Krishna) ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అనంతపురం జిల్లా (Anantapuram District) హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Bala Krishna) ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు... బాలకృష్ణ ఇంటి వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయలుదేరారు. రెండు పార్టీల నేతలు బాలయ్య ఇంటికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరో అభివృద్ధి పనిచేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ చంద్రమౌళీ విమర్శించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వడంలేదని మండిపడుతోంది.ఈ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. రెండు వర్గాలు బాలయ్య ఇంటివద్ద చర్చకు సిద్ధమని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.