TIRUPATI TEMPLE CITY TIRUPATI CELEBRATING 892 FOUNDATION DAY FULL DETAILS HERE PRN TPT
Oldest City of AP: ఏపీలో 900 ఏళ్లనాటి నగరం..! ఘనంగా ఆవిర్భావ వేడుకలు..
ఘనంగా తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ముఖ్యమైన నగరాల్లో తిరుపతి (Tirupati) ఒకటి. దేశంలోనే ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరం. తిరుమల వెంకన్న పాదల చెంత వెలసిన తిరునగరికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ముఖ్యమైన నగరాల్లో తిరుపతి (Tirupati) ఒకటి. దేశంలోనే ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరం. తిరుమల వెంకన్న పాదల చెంత వెలసిన తిరునగరికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన నగరమైన తిరుపతికి 892 ఏళ్లు నిండాయి. తిరుపతి ఏర్పడి 892 ఏళ్లు నిండిన సందర్భంగా తిరుపతిలో వైభవంగా ర్యాలీ నిర్వహించారు. తిరునగరి జన్మదినాన్ని పురష్కరించుకుని మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కోట్లాది మందిచే జన్మదిన శుభాకాంక్షలు అందుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జఠిగిన తిరుపతి 892వ ఆవిర్భావ వేడుకలు ఆకట్టుకున్నాయి. జీయ్యర్ స్వాములు వెంటరాగా, వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాల ఆద్యంతం భక్తి ప్రపత్తులను చాటుతూ ప్రదర్శన సాగింది.
పౌరాణిక కళా బృందాల లయబద్ద విన్యాసాల నడుమ సాగిన కళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భూమన నిర్వహించిన ఆధ్యాత్మిక శోభా యాత్రను.. దారి పొడవునా పచ్చ తోరణాలు కట్టి, కర్పూర హారతులు పడుతూ, పూజలు నిర్వహిస్తూ భక్త జనులు స్వాగతించారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ప్రఖ్యాతులతో విరాజిల్లుతున్న నేటి తిరుపతిని 892 ఏళ్ల కిందట శ్రీ గోవిందరాజపురం గ్రామం పేరిట పునాది రాయి వేసి మరీ ఏర్పరిచిన శ్రీ రామానుజాచార్యలను స్మరించుకుని కార్యక్రమాన్ని భూమన చేపట్టారు. స్థానిక శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో శోభా యాత్రను నిర్వహించారు.
శ్రీ రామానుజాచార్యులవారు తన 112వ ఏట తిరుమలకు వెళ్ళడానికి తిరుపతికి వచ్చారు. అదే సమయంలో తిరుపతిలో వెలసిన పార్థసారథిస్వామి ఆలయం నేడు గోవిందరాజస్వామి ఆలయంగా పేరుగాంచిన ఆలయానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడం గమనించి అక్కడ గోవిందరాజస్వామి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ఇక కపిలతీర్థం సమీపంలో కొత్తూరు అనే గ్రామంలో వింత వ్యాధుల బారినపడి పలువురు మృత్యువాత పడుతుండడం శ్రీరామానుజాచార్యుల దృష్టికి వచ్చింది.
గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంగానే కొత్తూరు వాసులను సంరక్షించేందుకు 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గరుడ పక్షి ఆకారంలో నూతన గ్రామానికి హద్దులు నిర్ణయించి శంకుస్థాపన చేశారు. ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేసి కొత్తూరువాసులకు నివాసం కల్పించారు. కాలక్రమేణా ఆ గ్రామం రామానుజపురంగా పేరుపొందింది. తమిళరాజుల ప్రభావంతో 13వ శతాబ్దంలో తిరుపతిగా మారి ప్రసిద్ధికెక్కింది.
ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందడానికి కారణమైందని పండితులు పేర్కొంటున్నారు. నాటి గోవిందరాజ పట్నంలోని కృష్ణాపురం ఠానా, నాలుగు కాళ్ల మం డపం, ప్రస్తుత రైల్వేస్టేషన్ కు తూర్పు ప్రాంతం, బేరివీధిలో నాలుగు మండపాలను నిర్మించి శ్రీఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.