హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mangli : TTD - SVBC సలహాదారుగా మంగ్లీ.. బాధ్యతలు స్వీకరించిన సింగర్

Mangli : TTD - SVBC సలహాదారుగా మంగ్లీ.. బాధ్యతలు స్వీకరించిన సింగర్

సింగర్ మంగ్లీ (File Photo)

సింగర్ మంగ్లీ (File Photo)

Mangli : ప్రముఖ సింగర్ మంగ్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పదవిని ఇచ్చింది. మొన్ననే బాధ్యతలు స్వీకరించిన మంగ్లీ.. ఈ పదవిలో రెండేళ్ల కాలం కొనసాగనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Singer Mangli : తనదైన పాటలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ.. ఇప్పుడు ప్రజా సేవలో తరించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛానెల్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి.. ఈ సంవత్సరం మార్చిలోనే ఉత్తర్వులను జారీ చేసింది SVBC. నాలుగు రోజుల కిందట మంగ్లీ ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

రూ.లక్ష వేతనం :

ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు మంగ్లీకి నెలకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఆమెకు ఈ పదవిని ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మంగ్లీ మొదటి నుంచి కష్టపడి పైకొచ్చారు. బోనాల పాటలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు అద్భుతంగా పాడి.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ పదవిలోనూ రాణించేందుకు సిద్ధమయ్యారు. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహా హత్య.. కూతుర్ని చంపి తండ్రి పక్కా స్కెచ్...

వసతి ఏర్పాట్లు :

ఇకపై మంగ్లీ తిరుపతికి వచ్చినప్పుడల్లా.. వాహన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఐతే.. ఈ నియామకాన్ని ప్రభుత్వం గానీ, SVBC గానీ అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశం. మంగ్లీ కూడా దీనిపై స్పందించలేదు. ఐతే.. నవంబర్ 17న ఆమె తిరుమలకు వచ్చి.. రెండ్రోజులు అక్కడే ఉండి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే ఆమె బాధ్యతలు స్వీకరించారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాలని అభిమానులు కోరుతున్నారు.

First published:

Tags: News, Telugu news, Tirumala, Ttd

ఉత్తమ కథలు