Home /News /andhra-pradesh /

TIRUPATI TEACHER HARASSING STUDENTS IN SCHOOL AS HE THREATEN THEM TO MARRY FULL DETAILS HERE PRN TPT

Tirupati: చదువులు చెప్పమంటే అంత నీచానికి పాల్పడతావా..? నీకంటే చిత్తకార్తె కుక్కలు నయం.

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Harassment: ప్రతి ఒక్కరి జీవితంలో గురువులు ముఖ్యపాత్ర పోషిస్తారు. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ గురువు గాడి తప్పి కీచక అవతారమెత్తాడు. చిత్తకార్తె కుక్కలకంటే దారుణంగా ప్రవర్తించాడు.

  GT Hemanth Kumar, News18, Tirupati

  విద్యార్థుల భవితకు బాటను బంగారు సోపానంగా మార్చేది గురువులే. చిన్నతనం నుంచి క్రమశిక్షణ, సంస్కారం, ఆత్మస్థైర్యాన్ని, బుద్దిని ప్రసాదించేది ఉపాధ్యాయులే. నేటి బాలలను రేపటి మంచి పౌరులుగా ఉన్నస్థాయికి వెళ్లాలంటే పునాదులు వేయాల్సింది అధ్యాపకులే. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో గురువులు ముఖ్యపాత్ర పోషిస్తారు. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ గురువు గాడి తప్పి కీచక అవతారమెత్తాడు. అభం శుభం ఎరుగని బాలికలపై పైశాచికత్వాన్ని చూపి.. లైంగిక దాడులు చేసేందుకు యత్నించాడు. విజృత చేష్టలు, విచిత్ర ప్రవర్తనతో బాలికలను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడితే చాక్ పీస్ తాళి కట్టి పెళ్లి చేసుకుంటానంటూ వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

  వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారు పాళ్యం మండలం చిల్లగుంటపల్లె ప్రాధమిక పాఠశాలలో అబు (58) అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. 4వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పాటలు చెప్తుంటాడు. కానీ ఈ వయసులో కూడా అతడి మనస్సులో పాడుబుద్ధిపుట్టింది. గురువుగా వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆప్యాయంగా చూసుకోవాల్సిన వాడు కీచకుడిగా మారాడు. అభంశుభం ఎరుగని చిన్నారుల పట్ల పైశాచికత్వాన్ని చూపాడు. చిన్నారులైతే ఎవరికీ చెప్పరని.. వారిపై లైంగిక దాడికి పాల్పడవచ్చని భావించాడు. 4, 5తరగత్తులో చదువుతున్న 11 మంది చిన్నారులపై వేధించేవాడు. పిల్లల ఒంటిపై చేతులు వేసి ఎక్కడెడ్డకో తడిమే వాడు. ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిన., ఇతరులతో మాట్లాడిన టీసీ ఇచ్చి పంపేస్తాని.. లేదంటే చాక్ పిష్ కి ఓ తాడు కట్టి దానితో తాళి కట్టేస్తానని బెదిరింపులకు దిగేవాడు.

  ఇది చదవండి: భర్త, పిల్లలతో హాయిగా ఉండకుండా దారితప్పావ్.. చివరకి ఆ బంధానికే బలయ్యావు కదమ్మా..


  అంతేకాదు అతని పైశాచికత్సం ఎస్థాయిలో ఉందంటే.. పిల్లలు అందంగా ఉండాలని అందరికి తలలు దువ్వి, పౌడర్ రాసి, బొట్టు బిళ్ళలు పెట్టేవాడు. ఇందులో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక శుక్రవారం సాయంత్రం తన తల్లిదండ్రులకు విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లందండ్రులు వెంటనే స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఇందుశేఖర్రెడ్డి, సర్పంచి దీప ద్వారా కలెక్టరు హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడి కోసం పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు గాలిస్తున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అబుని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల జిల్లాలోని కార్వేటి నగరంలోని ఓ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ సోమయ్య విద్యార్థినులను వేధించడంతో తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Harassment

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు